హిందూ ముస్లిం భాయీ..భాయీ..అన్నారు గాంధీజీ అంతకుమించి ఎక్కువగా మా ఊరిలో మేము ముస్లింలతో బాబాయ్‌, అబ్బాయ్‌, మామా, అల్లుడు, అక్కా,బావ అని ఆప్యాయంగా పిలుచుకుంటాం. ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటాం, జీవిస్తుంటాం. కొన్ని పట్టణాలలో ఒకరి పండుగ రోజు కొన్ని ఆంక్షలు, ఇంకోకరి పండుగ దినాన ఇంకొన్ని ఆంక్షల నడుమ జీవించే నగరాలకు లా కాకుండా… మా ఊరిలో హిందువుల పండుగల కోసం వారికన్నా ఎక్కువగా ముస్లింలు ఆసక్తిగా ఎదురు చూసే వాళ్ళు. కారణం పండుగల దినాన వీరికి వ్యాపారరిత్యా పండుగే. ఎలా అంటరా… పూలూ పండ్లూ, మటన్‌ షాపులూ, కిల్లీ దుకాణాలూ, డెకరేషన్లూ, అబ్బో! ఒక్కటేంటి! అంతా వారే! అన్నింటా వారే! మా ముసల్‌మాన్‌ బంధువులు… అలానే వారి పండుగల కోసం మేముకూడా రంజాన్‌ మాసాన ఈద్‌ ముబారక్‌ అంటూ ఇచ్చే ఆత్మీయ ఆలింగనాలకు, కల్మషం లేని వారి ఆహ్వనాలకోసం, నిజం చెప్పాలంటే, వారు చేసే ఖీర్‌ (పాయిసం) స్పెషల్స్‌, బిరియానీలంటే పడి చచ్చిపోతాం.

ఆ విధంగా ఇంకెక్కడా, కానరాని అధ్బుతమయిన మత సామరస్యం మా ఊరిలో వెలిగి పోయేది.

ఎ్కడనుంచి దాపురించిందో ఓర్వలేని ఈ మత రక్కసి తన నిర్ధాక్షిణ్య పంజాతో ఒక్కసారిగా ఊరు ఊరంతా వణికిపోయింది. ఇదికేవలం ఇరు వర్గాలలోని కొన్ని కుటుంబాలూ కొందరు వ్యక్తులూ, ఇంకోంతమంది నీచ రాజకీయనాయకుల స్వార్ధ రాక్షస క్రీడా, కారి నీచ ప్రయోజనాలకోసం ఈ ర్కసిని ఉసిగొల్పారు…

దానికి ఫలితం – ఆప్యాయంగా ఖాసిమ్‌ ఛాఛా అని పిలిచే నా గొంతు ఒక్కసారిగా తడబడింది. కారణం… నన్ను చూడగానే ‘ఖ్యారే బేటా’ అనే ఆయన పిలుపులో మార్పు. ‘చెప్పయ్యా’ అన్న మార్పు. అంతకుముందు ఖాసిమ్‌ ఛాఛా ఇచ్చే టీ గ్లాసు ఎప్పుడూ తక్కువే అన్న గొడవ… మరి ఇప్పుడు అడక్కుండానే గ్లాసునింగా టీ!!! పెరిగింది గ్లాసులోని టీ మాత్రమే కాదు మా అనుబంధాలూ, ఆప్యాయతల మధ్య దూరం కూడా… ఇలా ఒక్కరు కాదు పూలు అమ్మే షరీఫ్‌, పండ్లు అమ్మే ఫబ్బీర్‌, ఇరానీ కేఫ్‌ బషీర్‌, మటన్‌ కొట్టు మహమ్మద్‌…

‘టీ పెరిగింది. టేస్టే తగ్గింది’

‘పండ్ల బరువుపెరిగింది. రుచి తగ్గింది’

‘పూల గుత్తీ బరుకెవెక్కింది. సువాసన తగ్గింది’

కారణం… భయం. అభద్రతా భావం అనే భీజాలు వారి మదిలో మొలకెత్తాయి, ఏంచేస్తే ఈ పరిస్థితి ఆదిలోనే అంతమవుతుంది? మీరయినా చెప్పరూ…. అందుకే మనిషిని మనిషకి కాకుండా చేసే ఈ మతం మాకొద్దు…వద్దు…వద్దు…చివరగా – మనిషికోసం మతం. మతం కోసం మనిషికాదు.

Krishna Murthy

He is pursuing PG Diploma in Journalism (PGDJ) in A.P College of Journalism, Hyderabad. He aspires to become a successful Journalist and an established writer. His friends call him Kheemu.
Krishna Murthy

2 thoughts on “మనిషి మనిషిని కాకుండా చేసే మతం మాకొద్దు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *