ఆప్యాత అనురాగాలకి మా ఇల్లు ఓ పొదరిల్లు. అమ్మనాన్నకి నేను ఒక్కదాన్నే అవ్వడంతో చాలా ప్రేమగా పెంచారు. వారి ప్రేమకి ఏ రూపాన రుణం తీర్చుకోను అనిపించేది. కొన్ని లక్షల సార్లు అనుకున్న- బాగా చదివి ఓ స్ధానాన్నిసంపాదించి మా వాళ్ల ఆనందానికి కారణం అవ్వాలని. నా 21 సంవత్సరాలు మా అమ్మనాన్న ప్రేమతో , స్నేహితుల ప్రోత్సాహంతో చిన్న చిన్న అలకలతో సంతోషంగా సాగింది. అవ్వన్నీ ఎప్పటికీ మరిచిపోని అనుభూతులు. ఈ రోజు నేను సాధించాలనుకున్న నా జీవిత ఆశయానికి […]
నేనంటే అంత చులకనెందుకు
లోకంలో అందరితో పాటు నేను ఉన్నాను అనుకున్నాను… కాని ఒ మనిషిలా కాదు ఎవరికి ఏమి కాని ఒ వింత జీవిలా అని ఈ మధ్యనే తెలిసింది… ఇంతకు నేను ఎవరో చెప్పలేదు కదూ… నేనో కాటికాపరిని… చావులు చేస్తాను. పుట్టుకను దేవుడు ఇస్తాడు … మరణాన్ని దేవుడే ఇస్తాడు. ఓ జీవి ఈ లోకంలోకి అడుగు పెడుతున్నడు అంటే ఎక్కడ లేని సంతోషం మనలో కలుగుతుంది.. అలాగే మనకి ఎంతో ఆప్తులైన వారు దూరం అయిపోతే […]
పగవాడికి కూడా ఈ జీవితం వద్దు!
నా పేరు ఒరేయ్, అందరూ నన్ను ఇలాగే పిలుస్తుంటారు. ఒరేయ్ ఏంటీ గమ్మత్తుగా వుందే నీ పేరు వినగానే నవ్వువచ్చేటట్లు! ఇంతకూ ఈ పేరు పెట్టింది ఎవరూ అనేగా మీ ప్రశ్న. నిజానికి దీన్ని పేరు అని అంటారో లేదో కూడా నాకు తెలియదు. మీ అందరికీ నవ్వు తెప్పించే నా పేరు, నాకు మాత్రం ఇలా ఎవరైనా పిలిస్తే బాధగా వుంటుంది. ఎందుకంటే నాకు అమ్మ నాన్న, బామ్మ అందరూ ఉన్నారు కాని వీరిలో ఏ […]
కాలమా కాసేపు ఆగలేవా?
”చిన్నా, స్వీటీ! లెవ్వండిరా! స్కూల్‌కి టైం అవుతుంది!” అని అమ్మ నిద్ర లేపుతుంది. అప్పుడే పుట్టిన పాపాయి ఫలానా టైంకి పాప పుట్టింది అని డాక్టర్ కన్‌ఫర్మ్ చేసినప్పుడు, ఆ టైం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అనేంతలా ఉంటుంది ఆ క్షణం. సమయం మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. గోడ మీద ఉన్న గడియారం పాడైతే పక్కన పెడతాం కానీ, తెలియకుండానే ఆ గోడవైపు చూస్తాం. చేతికి రోజూ వాచ్ పెట్టుకొని ఒక రోజు […]
నేను కాదా సెలీబ్రిటీ ని?
సెలబ్రటీస్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీళ్ళు ఏ చిన్న పని చేసినా పెద్ద రేంజ్‌లో పేరు వచ్చేస్తుంది. ఫ్లాప్ ఓపెనింగ్స్ చేయించడం, వీళ్ళనే అంబాసిడర్స్‌గా పెట్టుకొని వ్యాపారులు తమ మార్కెట్‌ని పెంచుకోవటం వంటివి చూస్తూనే ఉన్నారు. సెలబ్రెటీస్ అంటే ఎవరు? కళా రంగానికి సంబంధించిన వారు రాజకీయ నాయకులు స్పోర్ట్స్ పర్సన్స్ గుడిలో దేవుడి దర్శనానికైనా శ్రద్ధతో వెళతారో లేదో కానీ ఫలానా సెలబ్రెటీ ఏ షాప్ ఓపెనింగ్‌కో, ఏ సభకో స్పెషల్ గెస్ట్‌గా […]
చైల్డ్ లేబర్
చైల్డ్ అంటేనే పసితనం అందరిలా సాటిపిల్లల్ని చూస్తూ అనందంగా ఆటపాటలతో గడిపే వయస్సులో కష్టాన్ని నమ్ముకుంటూ బ్రతుకు బండిని మోసేవారిలో ఈ పసిపిల్లలే ఎక్కువుగా కనిపిస్తున్నారు. ఈ వయస్సులో ఏం తెలుసు అని ఇలాంటి జీవితాన్ని చూస్తున్నారు? బ్రతుకు బండిని నడిపేదే డబ్బు ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి కటిక బిదవాడి దగ్గర నుండి ఏడు అంతస్తుల మేడలో ఉన్న గొప్పవాడికి కూడా డబ్బులేనిదే పూటగడవదు. ఉన్నవాడికి వాడికి డబ్బు విలువ తెలీదు. లెనివాడికి డబ్బు విలువ తెలిసినా […]