Category: Telugu

  • జర్నలిజం, సాఫ్ట్‌వేర్ వృత్తు లలో ఆసక్తికర వాస్తవాలు

    జర్నలిజం, సాఫ్ట్‌వేర్ వృత్తు లలో ఆసక్తికర వాస్తవాలు

    విద్యార్థులు కేరీర్ గురించి ఆలోచించినప్పుడెల్లా ఐటీ యే ముందుకొస్తుంది. మీడియా రాదు. ఐటీ తర్వాతే మీడియా అనుకుంటారు. కానీ కాదు. ఈ వాస్తవాన్ని ఇప్పుడిప్పుడు గుర్తిస్తున్నారు. మీడియా లో మంచి భవిష్యత్తు వుంది. వాస్తవాలను వార్తల రూపంలో ప్రజలకు చెప్పాలన్న కోరిక చాలు. ఆసక్తి మీది. దాన్ని నెరవేర్చే బాధ్యత మాది. 

    జర్నలిజంలో ప్రారంభ జీతాలు = ఐటీలో ప్రారంభ జీతాలు

    అవును, మీరు చదివింది నిజమే.

    నూతనంగా కెరీర్ ప్రారంభిస్తున్న వారికి సాఫ్ట్‌వేర్ రంగంలో ఎలా అయితే 22,000 నుంచి 25,000 వేల నెల జీతం ఉంటుందో జర్నలిజం రంగంలో కూడా అలానే ఉంటుంది. రిపోర్టర్లకు, సబ్ ఎడిటర్లకు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు అంతే ప్యాకేజీలను అందుతున్నాయి.

    అందుచేత, మీరు జర్నలిజం కోర్సుతో పాటు, వీడియో ఎడిటింగ్ , ప్రొడక్షన్, కెమెరా మెళకువలతో మరికొన్ని అదనపు నైపుణ్యాలను ప్రదర్శిస్తే, సాఫ్ట్ వేర్ రంగంలో వున్న మీ స్నేహితుల కన్నా ఎక్కువ సంపాదించగలుగుతారు.

    వీడియో స్కిల్స్= అధిక అర్జన

    మల్టీమీడియా జర్నలిస్టులకు ఉన్న డిమాండ్ రోజురోజుకీ పెరుగుతుంది. వీడియోలు షూట్ చేసి Youtube, Instagram వెబ్ సైట్లు లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లలో ఎడిట్ చెయ్యగల వారి కోసం ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది.

    అందుకే ఏపీ కాలేజీ ఆఫ్ జర్నలిజంలో వీడియో జర్నలిజం గురించి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. దాని వల్ల మీకు ఉద్యోగానికి ఉద్యోగమూ వస్తుంది; సంపాదనకు సంపాదనా పెరుగుతుంది.

    ఉదాహరణ: వీడియో ఎడిటింగ్ స్కిల్ లో ప్రావీణ్యం పొందిన మా కాలేజీ గ్రాడ్య యేట్ కి హైదరాబాద్ లో పేరొందిన డిజిటల్ వార్త సంస్ధ నుంచి నెలకు 30,000 రుపాయల తో ఉద్యోగం మొదలయింది.

    వేగం పుంజుకుంటున్న తెలుగు ప్రసార మాధ్యమాలు

    తెలుగు ప్రసార మాధ్యమాలలో జీతాల పెరుగదల బాగా ఉంది.  టీవీ, ప్రింట్ లేదా డిజిటల్ మీడియాలో మీరు ట్రైన్డ్ జర్నలిస్ట్ అయితే మీ జీతం 22,000 నుంచి 25,000 మధ్య మొదలు కావటం ఖాయం.

    Youtube shorts, Instagram Reels, Anchoring,  వార్తా రచనలో మంచి శిక్షణ పొందిన వారికి  డిజిటల్ మీడియా సంస్థలలో డిమాండ్ ఉంది. 

    జర్నలిజం= కేరీర్ + సంతృప్తి

    చేసే పనికి జీతం ఎంత ముఖ్యమో, ఆత్మ సంతృప్తి కూడా అంతే ముఖ్యం.

    జర్నలిజం మీకిచ్చే సౌలభ్యాలు

    • రచన ద్వారా సమాజంపై ప్రభావం చూపడం.
    • ప్రజా అబిప్రాయాన్ని మార్చటానికి ఉపయోగపడే కధనాలు చెప్పడం.
    • కొత్త విషయాలు, టెక్నాలజీ , శోధనల గురించి అనునిత్యం తెలుసుకోవడం.
    • రోజుకో కొత్త అనుభవం, సరికొత్త విషయాలతో నిండిన జర్నలిజం మీరు చేసే 9-5 జాబ్ లకు భిన్నంగా సవాళ్లతో కూడి ఉంటుంది.

    మీడియా యాజమాన్యాలు ఏమి కోరుకుంటున్నాయి?

    యువ పాత్రికేయుల నుం చి మీడియా యాజమాన్యాలు ఏమి కోరుకుంటున్నాయి?

    • రచన, కమ్యూనికేషన్ లో ప్రావీణ్యం.
    • కరెంట్ అఫైర్స్ మీద అవగాహన.
    • వీడియో షూటింగ్, ఎడిటింగ్ లో శిక్షణ.
    • వార్తా కథనాలు, షార్ట్ వీడియోలు చెయ్యగల నేర్పు.

    మా ఏపీ జర్నలిజం కాలేజీలో మీకు సరిగ్గా ఇవే నేర్పిస్తారు.

    థియరీతో కూడిన ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకుందాం అనుకునేవారికి ఇది ఒక అద్భుతావకాశం.

    కెరీర్ లో ఎదుగుదల ఖాయం

    22-25 వేల నెల జీతంతో మొదలైన మా కాలేజీ విద్యార్దుల వేతనం కేవలం 2-3 ఏళ్లల్లోనే 45-60 వేలకు, ఆపైన కూడా పెరిగింది. నిరంతర అధ్యయనం, కొత్త విషయాలపై ఆసక్తి మీకు ఉంటే మీ ఎదుగుదల కొనసాగుతూనే వుంటుంది.

    చివరిగా ఒక్క మాట

    జర్నలిజం పట్ల ఆసక్తి ఉన్నా, సంపాదన గురించే మీ ఆలోచన అయితే భయం వద్దు.  ఐటీ జాబ్ లాగే మీడియాలోనూ, జీతంతో పాటూ వెలకట్టలేని ఆనందం, సంతృప్తి మీ సొంతం. అవుతాయి.

  • జర్నలిస్టు అవుదామనుకుంటుంన్నారా? అయితే ఇవి తెలుసుకోండి…

    జర్నలిస్టు అవుదామనుకుంటుంన్నారా? అయితే ఇవి తెలుసుకోండి…

    వాస్తవాలను తెలియపరచడమే జర్నలిజం కాదు. ప్రయోజకరమైన కధనాలను ప్రచురించడం, ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించేలా చేయడం, ప్రజల తమంతట తాము నిర్ణయాలు తీసుకునే విధంగా సమాచారాన్ని అందించడం జర్నలిజం.  ఈరోజుల్లో జర్నలిస్ట్ అవ్వడం ఏలా? మీరు విద్యార్ధా, లేదా కెరీయర్ ను మార్చుకోవాలనుకుంటున్నారా, లేక మీకు ఈ రంగం మీద అమితాశక్తా, అయితే జర్నలిజంలో ప్రాధమిక అంశాలు తెలుసుకోవడానికి ఈ వ్యాసం మీకు ఉపయోగపడుతుంది.

    అపోహ-వాస్తవం: ఏది జర్నలిజం?(ఏది కాదు?)

    • అపోహ: జర్నలిస్టులు కేవలం వార్తలే రాస్తారు.
    • వాస్తవం:. ప్రజలకు తెలియని, తెలియాల్సిన విషయాలను పరిశోధన, ఇంటర్యూలు ద్వారా తెలియజేయడం. విషయవాస్తవికతను నిర్దారించి, పలు మాధ్యమాలలో అనగా డిజిటల్, బ్రాడ్ క్యాస్ట్,సోషల్ మీడియాలో కధనాలను చెప్పడం జర్నలిజంలో భాగాలు.
    • అపోహ: జర్నలిజం అంతరించిపోతుంది.
    • వాస్తవం: పత్రికల ప్రచురణ తగ్గి,  డిజిటల్ జర్నలిజం, ఇన్వెష్టిగేటివ్ రిపోర్టింగ్, వీడియో స్టోరీస్గా రుపాంతరం చెందుతున్నాయి.విశ్వసనీయ సమాచారానికి ఉన్న అవసరం ఏమాత్రం తగ్గలేదు.
    • అపోహ:జర్నలిస్ట్ అవ్వాలంటే మీకు జర్నలిజంలో డిగ్రీ తప్పనిసరి.     
    • వాస్తవం:డిగ్రీ ఉపయోగకరమైనప్పటికీ, స్యీయ అధ్యయనం, ఉద్యోగ అనుభవం ద్వారా నేర్చుకున్న ఎందరో జర్నలిస్టులు ఇప్పుడు విజయవంతంగా రాణిస్తున్నారు.  అన్ని వేళల్లో సమర్ధవంతంగా ఆలోచించడం, రాయడం, ప్రచురించడం ఇక్కడ ప్రధానం.

    జర్నలిస్ట్ కావాలనుకునేవారికి ఉండవలసిన నైపుణ్యాలు

    వీటిని మీరు ఆకలింపు చేసుకుంటే మీరు జర్నలిజంలో విజయం సాధిస్తారు.

    1. రచనా నైపుణ్యం– స్పష్టంగా, సంక్షిప్తంగా, వినియోగదారులను ఆకట్టుకునేలా రాయగలగాలి.
    2. పరిశోదన, వాస్తవ నిర్దారణ- రిపోర్ట్ చేసే అంశం వాస్తవమైనదా, విశ్వసనీయమైనదా లేదా సరిచూసుకోవాలి.
    3. ఇంటర్వూ మెలుకువలు-అర్ధవంతమైన సమాధానాల కోసం సరైన ప్రశ్నలను అడగగలగాలి.
    4. వీడియో, ఆడియో నిర్మాణం-వార్తను చిత్రించడం, వార్త కధనాలను రాయడం ద్వారా మల్టీమీడియా యుగంలో ముందుండవచ్చు.
    5. అనుకూలత– మారుతున్న మీడియాలో మార్పులకు తగ్గట్టుగా జర్నలిస్ట్ తనని తాను అలవరచుకోవాలి.

    ప్రారంభించడం ఎలా?

    జర్నలిజం పట్ల మీకు నిజమైన ఆశక్తి ఉంటే, మీరు చేయవలసిన కొన్ని పనులు.

    1. రాయడం ప్రారంభించడం– ఒక బ్లాగ్ ను ప్రారంభించడండి, ఏదైనా మాధ్యమంలో రాయండి. మీరు ఎంత ఎక్కువ రాస్తే అంత బాగా రాస్తారు.
    2. వార్తలను అనుసరించండి– కొత్త విషయాలను, ఘటనలను తెలుసుకోవడంలో ముందుండండి, ఒకే కధనాన్ని వివిధ మాధ్యమాలు ఎలా ప్రచురిసున్నాయో గమనించండి.
    • విడియోలతో ప్రయోగం చేయండి.- మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ఉపయోగించి రిపోర్టింగ్ చెయ్యవచ్చు. మీరే వీడియోలను రికార్డ్ చేసి వాటిని ఎడిట్ చేయండి.
    • పోర్ట్ ఫోలియోను నిర్మించుకోండి– ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నపుడు వాటిలో మీరు రాసిన లేదా చిత్రించిన వాటిని ముందుంచండి.
    • జర్నలిజంలో శిక్షణను పరిగణించండి– మీడియా రంగంలో మీకు అన్నివిధాలుగా శిక్షణ ఇచ్చి మీ యొక్క భవిష్యత్తుకు తమ వంతు సహాయం చేసేందుకు  ఏ. పీ . కాలేజ్ ఆఫ్ జర్నలిజం సమగ్ర శిక్షణ పధ్దతులతో, సాటిలేని చరిత్రతో మీకు అందుబాటులోనే ఉంటుంది.

    చివరిగా

    జర్నలిజం సవాళ్లతో కూడుకున్నా లాభధాయకమైన ఉద్యోగం. మీరు కధనాలు, నిజాలను చెప్పి మీకంటూ ఒక ఫ్రత్యేకత ఉండాలి అని కోరుకునే వాళ్లు అయితే ఈ రంగం మీ కోసమే.  ఆసక్తితో అడుగేయండి, నిత్యవిద్యార్ధిగా ఉండండి, రిపోర్టింగ్ మొదలు పెట్టండి- ప్రపంచం గొప్ప జర్నలిస్ట్ ల గురించి వేచి చూస్తుంది.

  • ఉత్తమ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గా మా పూర్వ విద్యార్థి

    తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ. కె. తారకరామారావు నుంచి ఉత్తమ స్పోర్ట్స్ రిపోర్ట‌ర్ గా అవార్డును స్వీకరించిన మా విద్యార్థి ఎస్.ఎస్.బి. సంజ‌య్ కి అభినంద‌న‌లు.
    ప్ర‌స్తుతం ఆంధ్ర‌జ్యోతి స్పోర్ట్స్ క‌ర‌స్పాండెంట్ గా ప‌ని చేస్తున్న సంజ‌య్ 2015 సంవ‌త్స‌రంలో మన కాలేజీ (ఏపీ కాలేజీ అఫ్ జ‌ర్న‌లిజం)లోజాయిన్ అయ్యారు. కోర్సు పూర్తి చేసిన ఆనంత‌రం సొంతంగా వెబ్ మీడియా ప్రారంభించారు. తర్వాత ఏ.బి.ఎన్ ఆంధ్ర‌జ్యోతిలో స్పోర్ట్ విభాగంలో రిపోర్ట‌ర్‌గా చేరి, అన‌తి కాలంలో స్పోర్ట్స్ క‌ర‌స్పాడెంట్‌గాబాధ్య‌త‌లు స్వీకరించారు. స్పోర్ట్స్ కోఆర్డినేటర్ గా కూడా ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే (2020 వ సంవత్సరానికి) ఉత్త‌మ స్పోర్ట్స్ రిపోర్ట‌ర్ గా నిలిచారు.

    ఈ సందర్భంగా, కళాశాల ఛైర్మన్ సతీష్ చందర్, కరస్పాండెంట్ ఎం. గౌరీ చందర్ లు అభినందించారు. ఈ సందర్భంగా కళాశాలతో తనకున్న అనుంబంధాన్ని సంజయ్ ప్రస్తుత విద్యార్థులతో 5 ఫిబ్రవరి 2021 నాడు పంచుకున్నాడు.

  • కటాక్షించేవాడు దేవుడా ? కక్షకట్టేవాడు దేవుడా ?

    “ఇచ్చి-పుచ్చుకోండి!“ ఎంత ఇస్తారో అంతకంటే రెండింతలు ఎక్కువ గెలుచుకుంటారు. ధన, కనక, వస్తు రూపంలో నాకు టైం మీద సమర్పించుకుంటే అంతకి రెండింతలు మీరు గెలుచుకుంటారు.

    ఏదో T.V లో advertisement లా ఉంది అనుకుంటున్నారా? అయితే మీరు తీర్థం లో కాలేసినట్టే. ఇదేంటే? వేస్తే పప్పు లో వెయ్యాలి కానీ విడ్డూరంగా తీర్థం లో వేయడమేంటి అని ఆలోచిస్తున్నారా? తొందరెందుకు దండగా నేను ఉన్నాగా అండగా. ఆవేశపడకండి. మీకు అర్ధమయ్యేలా నేను చెబుతాను.

    కధలోకి వెళ్ళే ముందు ఇది చెప్పండి. గోవిందా- గోవింద. గట్టిగ చెప్పండి గోవిందా- గోవింద. ముచ్చటగా మూడోసారి చెప్పండి గోవిందా- గోవింద!

    ఇప్పుడు అసలు కధలోకి వద్దాం.

    సాక్షాత్ దైవస్వరూపుడు . . . కాదు కాదు, దైవమే Give and Take Policy ని పెట్టింది. అందుకే ముందే చెప్పా, ఇచ్చి పుచ్చుకో అని. త్రిలోకాల్లో ఈ Bill అమలులో ఉంది. అమలు చేసాక బిల్ ఏంటి? ఇదిప్పుడు చట్టం. ఇదే ప్రస్తుత న్యాయం కూడా.

    నిజమేగా దేవుడు చాల costly అయ్యాడు. అన్ని ఉన్నవారికే ఇంకా ఇవ్వడం దేవుడికి అలవాటైపోయింది. చాలా డబ్బులు హుండిలో వేసి, ఏ నగలో, బంగారమో ముడుపు కట్టేసారనుకోండి. అంతే! Super fast express లా మీ కోరికలన్నీ ఇట్టే ఫలించేస్తాయి.

    “మీరు మీ జాతకం ప్రకారం ఫలానా హోమం చేసి, అభిషేకం కూడా చేసి, ఇంత బంగారాన్ని దేవుడికి సమర్పించి, మరీ అరవై రకాల ప్రసాదాలు కాకపోయినా ఏ ఆరు రకాల వంటకాలో నివేదిస్తే చాలు, మీకు పెళ్ళి జరుగుతుంది. ఉద్యోగం నడుచుకుంటూ వస్తుంది. ఇక లక్ష్మి దేవి పరిగెత్తుకుంటూ వస్తుంది.” ఇలా ఏ బాబానో ఎవరికన్నా చెబితే ఏం చేస్తారు? ఏముంది, ఉన్నావారయితే మరుసటి రోజే ఆ పూజలన్ని చేసేస్తారు. మరి లేనివారు? ‘అయ్యో, అంత డబ్బే కనుక ఉంటే ఈ కష్టాలెందుకు’ అని బతికేస్తారు.

    ఈ మధ్య ఓ పూజలో ఒక బాబా చెబుతున్నమాటలివి. ” ఇవాళ ఈ పూజకొచ్చి, ప్రసాదం తిన్నవారే అదృష్టవంతులు. పూజకొచ్చి ప్రసాదం తినకుండా వెళ్ళినా, అసలు పూజకే రాని వారు చాలా దురదృష్టవంతులు.”

    మనలో మన మాట- పూజకి హడావిడిగా వచ్చి వెళ్ళిన వారిలో ఒకరు, ఏ కోట్ల రూపాయలలో బిజినెస్ కాంట్రాక్టు కోసమో వెళ్ళిఉండవచ్చుగా. మరి అతను కోట్ల బిజినెస్ చేస్తునందుకు అదృష్టవంతుడా? లేక ప్రసాదం తీసుకోనందుకు దురద్రుష్టవంతుడా? ఇక పూజకే రానివారు అంటారా . . గుడి బయట అడుక్కునేవారిని లోపలకి రానిస్తారా? పోనీ పూజ అవ్వగానే భక్తులందరికీ ప్రసాదం పెట్టినట్టు వీరికి ప్రత్యేకంగా వెళ్ళి ఇస్తారా? ఇవ్వరు. ఇచ్చినా అది మిగిలిన ప్రసాదం అయితే పెడతారు. మరి వీలందరు దురదృష్టవంతుల list లోకి వస్తారా?

    అందరిని చల్లగా చూసే బాధ్యత దేవుడిదే అంటారుగా. మరి ఉన్నవాడు- లేనివాడు అనే భేదాలు ఎందుకు? ఆయనకి పూజలు- పునస్కారాలు చేసి Publicity చేసేవారికే అన్ని ఇస్తాడు. ఇవేం చేయ్యనివారిని అసలు పట్టించుకోడు. ఇదేం న్యాయం తండ్రి! అందరు నీ బిడ్డలే అయినప్పుడు అందరిని సమానంగా చూడాలిగా. నువ్వే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు?

    మొక్కులు తీర్చకపోతే దేవుడు శిక్షిస్తాడా? టైం కి అన్ని మొక్కులు తీర్చేస్తేనే కోరుకున్నవి ప్రసదిస్తడా? ఓహో! అంటే దేవుడు కూడా మనుషుల్లా పగ తీర్చుకుంటాడు అన్నమాట.

    నాకెప్పుడు ఓ సందేహం ఉంటుంది. సమాజంలో దొంగ బాబాలు ఎందుకు పుట్టుకొస్తారు? డబ్బుకోసమేగా? మరి దేవుడు కూడా తన ఖాతాని పెంచుకోడానికే తన భక్తులకి ఇలాంటి సెంటిమెంట్లు పెడుతాడ?

    వినండి, బాగా వినండి. మీరు చాలా సంపాదించుకొని, మీ దెగ్గర కార్లు, బంగళాలు వచ్చేసాకా దేవుడిని ప్రార్ధించండి. మీకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తాడు. ఎందుకంటే మీరు కూడా RICH అనే మాట మెడలో వేసుకుని తిరుగుతారుగా.

    కాని కొండలలో నెలకొన్న స్వామి- కోనేటి లోని చిన్న చిన్న జీవ రాసులని కూడా అప్పుడప్పుడు ఏ ఆషాడం offer గానో, శ్రావణం sale లోనో, మరి ఇంకే discount season లోనో కనికరిస్తూ ఉండు. నువ్వు busy ఉండే పండగ season లో కాకపోయినా, తమరి ఖాళి సమయాల్లో కాస్త అలోచించి, నీ policy లో కొన్ని మార్పులు చెయ్యాలని ప్రార్ధిస్తున్నాను.

    మనం కూడా “స్వచ్ఛమయిన మనసుతో నమ్మి, స్వేచ్చగా జీవిద్దాం”. కానీ. . . . . ఆ స్వేచ్చకి ఎంత ఖర్చవుతుందో? ఆగండి, దేవుడినే అడిగి చెబుతా!!!

  • కథ: నిర్భయ పంజా దెబ్బ

    ఆ రోజు సాయంత్రం 8 అవుతుంది.

    మా ఆంటీ వాళ్ళింటికి వచ్చాను ఒక్కదాన్నే.

    మెరుపులకి తన కొడుకు అయినటువంటి ఆకాశం మీద కోపం వచ్చింది.

    ఆకాశంకి భాద కలిగింది, సమస్త ప్రాణలకి మాత అయినటువంటి భూమాత భాద కలిగింది.

    అమ్మా, నాన్న నన్ను కొట్టారు అని రుజువుగా కన్నీళ్ళు కారుస్తుంది ఆకాశం.

    ‘వెళ్ళొస్తాను ఆంటీ, వర్షం తగ్గేలా లేదు, మా ఆయన ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు’.

    ‘రేపు పొద్దున వెళ్ళొచ్చు కాని ఉండమ్మా’.

    ‘లేదు ఆంటీ, ఇంటి దగ్గర పిల్లలు నేను లేకుంటే ఏడుస్తారు. వెళ్ళొస్తాను ఆంటీ ఏమనుకోకండి’, అని ఇంటికి బయలుదేరాను.

    అలా కాలు బయట పెట్టానో లేదో..ఒక పెద్ద పిడుగు మా ఆంటీ వాళ్ళింటి పక్కన ఉన్న టవర్‌ మీద పడింది.

    నాకు ఒక్కసారిగా గుండె జారినంత పనయ్యింది.

    మెరుపులకి ఆకాశం మీద కోపం తగ్గనట్టుగా ఉంది. ఇంకా ఆకాశంపై నిప్పులు వెదజల్లుతున్నాడు.

    ఆంటీ వాళ్ళు ‘తాడపత్రి’ అనే మండలంలో ఉంటారు. మాది ‘ఊళ్ళూరు’ అనే కుగ్రామం. మాకు ఆంటీ వాళ్ళు దూరపు బందువులు. దూరపు బందువులు అన్న మాటే కాని దగ్గర వాళ్ళలా మసుకుంటాము. మాది పేద బతుకులు. డబ్బులు అవసరం ఉండగా ఆంటీ దగ్గర అప్పుగా తీసుకుందామని వచ్చాను.

    సమయం రాత్రి 9.05 అవుతుంది. మా ఆంటీ వాళ్ళింటి నుండి మా ఇల్లు 5 కి.మీ.

    ఆటోలు తప్ప మరింకేమి ఉండవు.

    ఆకాశంకి భాద ఎక్కువయినట్టుంది, చాలా జోరుగా విలపిస్తున్నాడు. ఆ కన్నీళ్ళకి నేను మొత్తం తడిసి ముద్దయిపోయాను

    ఆ తడికి నా శరీరం అంతా చల్లబడిపోయింది. చలికి వణికిపోతున్న సమయంలో పెద్దగా అరిచాయి మెరుపులు.

    దబేళ్‌..!
    ఒక్కసారిగా అటు పక్కనే ఉన్న తాటిచెట్టు కుప్ప కూలింది. నాకు ఏం చేయాలో తోచట్లేదు.

    సింహంలా గర్జిస్తున్న ఆ మెరుపులకి ఎన్నడూ రాని భాద ఈ రోజే వచ్చినట్టుగా విలిపిస్తున్న కన్నీళ్ళకి భయపడి ఒక్క ఆటో కూడా రావట్లేదు.

    దూరంలో ఏవో లైట్స్‌ వెలుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒక్కసారిగా నా గుండె 205 సార్లు కొట్టుకోవడం ఆగిపోయి ఎదా స్థితికి వచ్చి కొట్టుకోవటం మొదలుపెట్టింది.

    ఏదో వాహనంలా ఉంది, నా అదృష్టం కొద్ది ఆ వాహనం నేను వెళ్ళే దారి మీదుగానే వెళుతున్నట్టుగా ఉంది. ఆపమనట్టుగా చేతితో సూచించాను కాని ఆ కారులో ఉన్న వ్యక్తి చూసి చూడనట్టుగా కారుని పక్కకి తిప్పుకుని వెళ్ళిపోయాడు.

    ‘ ఛా..! ఎదవ..ఒక ఆడది ఒంటరిగా ఉంది, సహాయం చేద్దామని లేదు’ అని అతన్ని తిట్టుకుంటూ ఉండగా.

    జఫ్‌ఫ్‌ఫ్‌ఫ్‌..
    నీళ్ళల్లో బ్రేక్‌ వేసేసరికి కారు టైర్లు  జారాయి. కొంచెం దూరంలో ఆ కారు నాకు సహాయం చేస్తానన్నట్టుగా వేచి చూస్తుంది.

    నేను ఆ జోరు వానలో మొత్తం తడిసి ముద్దయి పోయాను. గబగబా పరుగెత్తుతూ కారు దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే కారు ఫ్రంట్‌ డోర్‌ ఓపెన్‌ చేయగానే లోపల కూర్చుని నా కొంగుతో తుడుచుకుంటున్నాను.

    ‘చాలా థ్యాంక్స్‌ అండీ, ఈ తుఫాన్‌లో ఎవ్వరూ రాట్లేదు, ఒక్క వాహనం కూడా రాట్లేదు అని భయపడుతున్న సమయంలో దేవుడిలా వచ్చారు, చాలా థ్యాంక్స్‌ అండీ’

    ఇట్స్‌ ఓకే! ఆని ఇంగ్లీష్‌లో సమాధానమిచ్చాడు.

    అతను చాలా పెద్ద మనిషిలా ఉన్నాడు. చూడటానికి చాలా డబ్బున్న వానిలా కనిపిస్తున్నాడు.

    ‘ఎక్కడి వరకు వెళ్ళాలమ్మ’ ? అని ఆ పెద్దమనిషి మందలించాడు.

    ‘ఊళ్ళూరు వరకు వెళ్ళాలండి’ అని చెబుతూ కొంగుతో తుడుచుకుంటున్నాను.

    ‘అవును, ఇంత రాత్రి వరకు ఇక్కడేం చేస్తున్నావమ్మ?’

    ‘ఇక్కడ దగ్గరలో మా ఆంటీ వాళ్ళు ఉంటారు, కొంచెం పని మీద వచ్చి ఈ వానలో ఇరుక్కుపోయానండి’

    బాగా తడిసి ఉండటం వల్ల నాకుండే కొంచెం సిగ్గు కాస్త పెరిగి మూడింతలు అయ్యింది. నా కొంగుతో అలా తుడుచుకుంటూ ఉండగా అతను నన్ను ఓరగా దొంగ చూపులు చూస్తున్నాడు. నా కొంగుతో నా ఒంటిని దాచుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. కాని ఆకాశం భాద నన్ను ఈ రోజు ఇలా ఇరుక్కునేలా చేసింది.

    మామూలుగా ఉంటేనే చూడకుండా ఉండలేని మగాళ్ళు(ఎవరో కొందరు) ఇక నిండా తడిసి ఉంటే చూడకుండా ఉండగలరా..!

    ఏదో చూస్తున్నట్టుగా నన్నే పదే పదే చూస్తున్నాడు.

    కావాలనే నన్ను తాకుతున్నాడు.

    ‘దేవుడా నన్ను రక్షించు’ అని మనసులో అనుకుంటూ ఉండగా,

    డగ్‌..డగ్‌..డగ్‌..డగ్‌… కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. కారు డోర్స్‌కి లాక్స్‌ ఆటోమేటిక్‌గా పడిపోయాయి. అప్పుడు అర్థమైంది కారు ఆగిపోలేదు, ఆపేసాడని. చిరుత చాలా ఆకలిగా ఉంది. జింక పిల్ల కన్పించింది. ఎలాగైనా వేటాడి చంపి తినేయాలని చూస్తుంది.

    ఆ వ్యక్తి నా దగ్గరికి వస్తూ ‘నీకెంత కావాలంటే అంత ఇస్తాను, ఈ ఒక్క రాత్రి నాతో సహకరించు’.

    చేపని పట్టుకోవటానికి డబ్బుని ఎరగా వేయాలనుకుంటున్నాడు. ఎరకి పడిపోటానికి దానికి నాకు ఒక్కటే తేడా

    ‘అది చేప, నేను ఆడదాన్ని’.

    నాకు కోపం ఆగలేదు.

    ‘ముండ కొడకా..ఆడదంటే అంగడిలో వస్తువు అనుకున్నావారా..డబ్బులిచ్చి కొనుక్కోటానికి?’

    అతన్ని అలా తిట్టగానే నా చెంప చెల్లుమనిపించాడు. చిరుత చేతికి జింక పిల్ల దొరికింది. నన్ను చాలా బలవంతం చేస్తున్నాడు. ఇంకొక 2 కి.మీ అయితే మా ఊరి పోలీస్‌ స్టేషన్‌ వస్తుంది అనగా కారు ఆపేసాడు. చిరుత తన కౄరమైన పల్లతో జింక మెడని కొరకటానికి ప్రయత్నిస్తుంది. నా చీర మొత్తం విప్పేసాడు.

    ఆడదంటే మగవాడి కింద నలిగి పోవటమేనా? ఆడ జాతికి విముక్తి లేదా?

    జింక పిల్ల పోట్లాడి పోట్లాడి నీరసించిపోయింది. నా కంటి నుండి నీరు కారటం మొదలు అయ్యింది. ఈ పశువు మృగంలా ప్రవర్తిస్తుంది.

    నేనేమి చెయ్యలేనా? ఈ మగ జాతి మృగ పాలనికి అంతం లేదా?” అని ఏడుస్తుండగా నా చేతికి ఏదో వస్తువు తగిలినట్టుగా అయ్యింది.

    కారులో ముందట ఉన్న చిన్న డిక్కీలో ఉంది ఆ వస్తువు. అది ఏంటి అని చూడకుండానే, నా కాలితో అతని చాతి మీద తన్నాను. అలా తన్నగానే అతను నా దగ్గరి నుండి వేరే సీట్‌లోకి వెళ్ళిపడ్డాడు.

    నా చేతికి వచ్చింది ‘హ్యాండ్‌ గన్‌’.

    ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ట్రిగ్గర్‌ నొక్కాను.

    గన్‌లో ఉన్న బుల్లెట్‌ కాంతివంతమైన వేగంతో అతని గుండెల్లోకి దూసుకెళ్ళింది. ఆ బుల్లెట్‌ అతని రక్తాన్ని నా చీరపై చిల్లేలా చేసింది.

    అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. జింక పిల్ల చిరుత నుండి తప్పించుకుంది. కారుకి ఉన్న కీ తిప్పగానే కారు డోర్స్‌ అన్‌లాక్‌ అయ్యాయి. రక్తసిక్తమైన నా చీరని అలాగే కట్టుకుని కారు దిగి ఆ వానలోనే తడుచుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళసాగాను. నాకేమి అర్థం కావట్లేదు.

    ‘నేను ఒక మృగాన్ని చంపానా? లేక మానవ రూపంలో ఉన్న మృగాన్ని చంపానా?’

    ఏది అయితేనేం చంపాను. మన దేశంలో మృగాన్ని చంపినా కేసే.

    అలా ఆలోచిస్తూ నడుస్తూ ఉండగా మా ఊరి చివర ఉన్న పోలీస్‌ స్టేషన్‌ వచ్చింది.

    నా చేతిలో గన్‌ అలాగే ఉంది.

    అలాగే లోపలకి నడుచుకుంటూ వెళ్ళాను. లోపల ఉన్న ఎస్‌.ఐ నన్ను అలా చూసి షాక్‌ అయ్యి కుర్చీలో జారిపడి టేబుల్‌ మీద కాళ్ళు పెట్టుకున్న అతను లేచి నిలబడ్డాడు.

    ఎస్‌.ఐ గారు నన్ను అత్యాచారం చేస్తుండగా నేను అతన్ని చంపేసాను. నన్ను అరెస్ట్‌ చేయండి, అని నా చేతిలో ఉన్న గన్‌ టేబుల్‌ మీద పెట్టి మూలకి వెళ్ళి కూర్చున్నాను.

    ఎస్‌.ఐ కి ఏం చేయాలో పాలుపోక కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

    ఒక్కసారిగా ఎస్‌.ఐ, ‘ ఏయ్‌ 202… ఊరి చివర యాక్సిడెంటు అయ్యిందంట… వెళ్ళారా..?’

    ‘ఎఫ్‌.ఐ.ఆర్‌ రాసుకున్నారా యాక్సిడెంటు అని,ఇవి కూడా చెప్పాలా అయ్యా మీకు? త్వరగా చేయండి’.

    ఎస్‌.ఐ నా వైపు తిరిగి, ‘ఏంటమ్మా..నీ కేసు ఏంటి? నీ గొర్రె పిల్ల కనబడగానే కబురు పెడతాను కాని వెళ్ళమ్మా’.

    ‘ఏయ్‌..205..ఈవిడని వాళ్ళింటి దగ్గర దిగబెట్టి రాపో’.

    అలా ఎస్‌.ఐ నన్నురక్షించగానే నా కంటి నిండా నీరు, నాకు ఏడ్పు ఆగక ఆ ఎస్‌.ఐ కాళ్ళ మీద పడిపోయాను.

    నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్ళిపోయాడు.

    ఆడ వాళ్ళ మీద అత్యాచారాలు ఎన్నడు ఆగుతాయి? నిర్భయ చట్టం అమలులోకి వచ్చినా కాని ఇంకా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.మారాల్సింది సమాజమా ? లేక మగాడిని అని మురిసిపోతున్న మృగ జాతా?

    ఈ కథలో ఎస్‌.ఐ లాంటి మనుషులు ఉన్నంత వరకు ఆడ జాతికి అన్యాయం జరగదు.

    ఈ కథ కొందరిని ఉద్ధేశించి రాసినది మాత్రమే.

    ”జైహింద్‌”

  • ‘మై లాస్ట్ నోట్’ చెప్పిన “నిజం’’

    ఎన్నో ఆశలు.. ఆశయాలతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన “రిషితేశ్వరి” సహ విద్యార్థుల లైంగిక వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. అయితే రిషితేశ్వరి బలవన్మరణానికి కారణాలేంటి..?

    ర్యాగింగ్ భూతమా…? కులాధిపత్య అరాచకమా..?

    ఇది కచ్చితంగా కులాధిపత్య అరాచకమే….  ర్యాగింగ్ ముసుగులో జరుగుతున్న కులాధిపత్య అరాచకం.. అసలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థుల సమస్యలపై పోరాడడమే విద్యార్థి సంఘాల ప్రథమ కర్తవ్యం.. కాని ఆ విద్యార్థి సంఘాలు ఆ బాధ్యతను మర్చిపోయాయి. ఇప్పుడు అవి విద్యార్థి కుల సంఘాలుగా మారాయి.

    ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అడుగు పెడితే చాలు..  మొదట కుల సంఘాల బోర్డులే స్వాగతం పలుకుతాయి. ఒక వైపు దేశంలోని అనేక యూనివర్సిటీలు సరికొత్త కోర్సులతో పరుగులు పెడుతుంటే.. నాగార్జున యూనివర్సిటీ మాత్రం కులం కుంపట్ల మధ్య, కులం  కుళ్లులోమగ్గిపోతుంది.

    ఏ సమస్య వచ్చినా విద్యార్థులకు అండగా ఉండాల్సిన విద్యార్థి సంఘాలు ఆ సమస్యలో కుల, రాజకీయ పరమైన అంశాలు వస్తే మాత్రం వాటి భావాజాలాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి.  ఉదాహరణకి ఏపీలో అధికార పక్షానికి అనుభంధంగా ఉన్న విద్యార్థి సంఘం ఈ కేసుకు సంబంధించి మాత్రం ఇప్పటి వరకు  రోడ్డే ఎక్కలేదు. అధికార పక్షం ధోరణి ఇలా ఉన్న…. ప్రతి పక్షాలు ఏమయ్యాయి.? రాజకీయ పరమైన విషయాల్లో ఏకమైయి  అఖిలపక్షం ఏర్పాటు చేసుకునే పార్టీలు… మానవత్వం విషయాలకు వచ్చే సరికి ఏమయ్యాయి..? ఒక వేళ పోరాడిన రాజకీయ పార్టీలు ఇలాంటి ఘటనలను పట్టుకుని పాలిటిక్స్ లో మైలేజ్ కోసం పాకులాడుతున్నాయి. నిజాయితీ గా న్యాయం చేయాలని పోరాడే పార్టీలు కరువైయ్యాయి. మరో నిర్భయ ఉద్యమం వస్తే తప్ప ఈ కేసులో నిందితులకు శిక్ష పడదు.

    అసలు ఏం జరిగింది..?

    వరంగల్ కు చెందిన రిషితేశ్వరి ఆర్కిటెక్చర్ చదువుకోవడానికి నాగార్జన యూనివర్సటీలో చేరింది. అయితే యూనివర్సటీలో అదే కోర్సు చేస్తున్న ఫైనలియర్ కు చెందిన శ్రీనివాస్, చరణ్ లు రిషితేశ్వరిని ప్రేమించాలని వేధించేవారు.  తాము చెప్పినట్లు చేయాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్న క్రమంలో జులై 13 న సినిమాకు వెళ్లిన రిషితేశ్వరిని సినిమా థియేటర్ లో కూడా వేధింపులకు గురి చేశారు. సినిమా మధ్యలో వచ్చినందుకు పనిష్మెంటుగా హాస్టల్ లో సీనియర్ విద్యార్థిని హనీషాతో ర్యాగింగ్  చేయించారు. ర్యాగింగ్ చేసినట్టు నిర్ధారణ కోసం మొబైల్ లో వీడియో తీయాలని సూచించారు. ఈ వీడియో ఆధారంగా చరణ్, శ్రీనివాస్ లు రిషితేశ్వరిని బ్లాక్ మొయిల్ చేశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేకే జులై 14న రిషితేశ్వరి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుందని విద్యార్థులలో బలంగా వినిసిస్తున్న వాదన.

    మానవత్వం ఎక్కడ….?

    మానవత్వం మంట కలిసిపోతుంది. ఒక ఆడపిల్ల మరొక ఆడపిల్లను వేధించడం సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. కనీసం ఒక్క నిమిషం రిషితేశ్వరిని వేధించే ముందు తను ఆత్మవిమర్శ చేసుకుంటే ఈ రోజు రిషితేశ్వరి మనందరిలా చిరునవ్వులు నవ్వుతూ మన మద్యే ఉండేది. “మాయమై పోతున్నడమ్మ మనిషన్న వాడు…  మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్న వాడు’’ అన్న అందెశ్రీ పాట ఈ ఘటనకు నిలువెత్తు నిదర్శనం.

    విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ ను అరికట్టాల్సిన అధ్యాపకులే ర్యాగింగ్ ను ప్రొత్సహిస్తున్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై నిజనిర్ధాణ కమిటీ ముందు విద్యార్థులందరు ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్ బాబురావుపై ఆరోపణలు చేస్తుండగా.. కొంతమంది ప్రిన్సిపల్ అనుకూలంగా ఉన్న విద్యార్థులు దాడికి దిగారు. ప్రిన్సిపల్ బాబురావును కాపాడే ప్రయత్నం చేశారు. తమ కులం వాడు కావడంతోనే కొంతమంది విద్యార్థులు కాపాడే ప్రయత్నం చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన అధ్యాపకులు కులం రొచ్చులో తాండవం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఈ కేసు మరుగున పడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

    రిషితేశ్వరి చివరి మాటలు

    నవ్వు..!నవ్వు..! నవ్వు..! ఈ నవ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడు నవ్వుతూ ఉండటమే కాదు అందరిని నవ్విస్తూ ఉంటా..కాని ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయింది.

    మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి పిచ్చి. అంత ప్రేమగా పెంచారునాన్న. నాకు చదువంటే చాలా ఇష్టం . ఈ చదువు(ఆర్కిటెక్చర్) కోసం నా ఊరు warangal వదిలి ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను.

    ఇలా వచ్చిన నన్ను నా seniors లో కొంత మంది చదువు వైపు కాకుండా ప్రేమ వైపు లాగడానికి ప్రయత్నించారు. నేను ఆ దారిలో వెళ్లలేదు. దాంతో నా మీద rumors spread చేశారు. అవి వింటేనే నా మోహంలో నవ్వు మాయమై పోయింది. ఏడుపు కూడా వచ్చేది.

    ఏ అమ్మాయి యూనివర్నటీలో ర్యాగింగ్ ఉండదు అని అనుకోవద్దు. యూనివర్సటీ అంటేనే ఒక పెద్ద నరకం లాంటిది.

    అని రిషితేశ్వరి రాసిన మై లాస్ట్ నోట్ లో చెప్నిన భయంకరమైన నిజం.

    ఇది మనకు తెలిసిన రిషికేశ్వరి జీవిత గాథ, కాని ఇంకా ఎన్నో కళాశాల్లో,  విశ్వవిద్యాలయాల్లో ఎంతో మంది రిషితేశ్వరిలు ర్యాగింగ్ పేరుతో నరకాన్ని అనుభవిస్తున్నారు. రిషితేశ్వరి ఘటనతోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ర్యాగింగ్ పై కఠినమైన చట్టాలను తెచ్చి విశ్వవిద్యాలయాల్లో, కళాశాల్లో ర్యాగింగ్ ను  అరికట్టాలి.

    – నన్నపనేని వరప్రసాద్

  • పెళ్లి కాని వితంతువు

    ధమాల్..!

    ఒక్కసారిగా పెద్ద అరుపు..

    రక్తం ఏరులై సెలఏరులై పారుతుంది.

    ఆ ఘటన చేసిన అతను కారు దిగి పారిపోయాడు.

    ”తన కంటి నిండా నీరు, ఏదో కోల్పోతున్నానన్న భాద, బ్రతకాలన్న పట్టుదల”

    ”తన చేతి వేళ్ళు చిన్న చిన్నగా కొట్టుకోవటం మొదలయ్యింది”

    అటుగా వెళుతున్న జనమంతా ఆ ఘటన జరిగిన ప్రదేశం దగ్గర మూగారు.

    ఏదో ఒక చిత్రం చూస్తున్నట్టుగా చూసున్నారే తప్ప, కాపాడటానికి ఒక్కరు కూడా ముందటికి రావట్లేదు.

    ” చేతి వేళ్ళు భూమిని తాకాయి, కళ్ళకి రక్షణగా ఉండవలసిన రక్షక భటులు ఒక్కసారిగా ఆగిపోయారు, నాలుగు గదుల అందమైన భవనం కుప్పకూలింది.”

    ”నా బొట్టు చెరిగింది, గాజులు పగిలాయి”

    ” కాని నాకింకా పెళ్ళి కాలేదు”

    మూడు ముళ్ళతో అద్భుతంగా మొదలవుతుంది ఆనుకున్న నా జీవితం ఇలా అర్థాంతరంగా సమాప్తం అవుతుందని అనుకోలేదు.

    ” నేను పుట్టగానే పెళ్ళి అయిపోయింది మా బావతో, పెరిగేకొద్దీ నాకూ, మా బావకి చనువు పెరగసాగింది, ఆ చనువు కాస్త ప్రేమగా మారి పెళ్ళి వరకు తీసుకొచ్చింది.”

    నా పెళ్ళి ముహూర్తం పొద్దున 9.47 ని.లకి

    సమయం 8.55  అవుతుంది.

    పంతులు మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు.

    ” ఓం గణాదిపతయే నమ:”

    ” అయ్యా.. పెళ్ళి కొడుకుని తీసుకురండి.”

    ”పంతులు గారు పెళ్ళికొడుకు ఇంకా రాలేదు, వస్తున్నాడు, దారిలో ఉన్నాడు” అని పంతులితో అన్నాడు మా మామయ్య( పెళ్ళి కొడుకు తండ్రి).

    సమయం ని.లు అవుతుంది, బావ ఇంకా రాలేదు.

    ” అమ్మా.. ఆ అక్షింతలు చేతిలో తీసుకో ”

    ” బావ ఇంకా రాలేదు ”

    పీటల మీద కూర్చున్న నేను

    ” నా కల నిజమయ్యింది ”

    ” నా బావ నా భర్త కాబోతున్నాడు ”

    ” బావ ఎప్పుడొచ్చి నా మెడలో తాళి కడితే ఎప్పుడెప్పుడు కొత్త జీవితాన్ని మొదలుపెడుదామా అని ఆలోచిస్తుండగా..”

    మా ఇంటి పాలేరు బయటి నుండి ఆయాసంతో పరుగెడుతూ వస్తున్నాడు, చాలా ఆయాస పడుతున్నాడు.

    ” అయ్యా..అయ్యా..అయ్యా..”

    ఏంటి రామయ్య ? ఏమైందో చెప్పు ? ఎందుకంత ఆయాస పడుతున్నావు ? అని మా మామయ్య రామయ్యని అడిగాడు.

    ” ఆహ్‌..ఆహ్‌..ఆహ్‌..ఆహ్‌..” చాలా ఆయాస పడుతున్నాడు.

    అలా ఆయాస పడుతూనే ” బాబు గారికి ”

    ” హా…బాబుకి??”

    ” యాక్సిడెంట్‌ అయ్యిందయ్యా..ఆసుపత్రిలో ఉన్నాడు ” అని రామయ్య చెప్పగానే అందరూ కంగారుగా ఆసుపత్రికి బయలుదేరారు.

    అందరూ వెళ్ళిపోయారు.

    నేను ఒక్కదాన్ని మాత్రం పీటల మీద అలాగే కూర్చున్నాను. అప్పటి వరకు ఆత్రుతగా ఎదురుచూసిన నా కళ్ళు ఒక్కసారిగా కన్నీటితో నిండిపోయాయి.

    రెండు గంటలు గడిచాయి. పీటల మీద అలాగే కూర్చున్నాను.

    మా పొరిగింటి సత్యం బాబాయి, తన భార్య మాట్లాడుకుంటూ వస్తున్నారు.

    వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు నాకు చిన్నచిన్నగా వినపడుతున్నాయి.

    అలా మాట్లాడుకుంటుండగా కొన్ని పదాలు నా చెవిని చేరగానే నా గుండె ఒక్కసారిగా ఆగిపోయింది.

    నా కన్నీటి చుక్కలు తిరిగి నా కంటిని చేరాయి.

    ” పాపం దారుణంగా చనిపోయాడు. పాతికేళ్ళకే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ”

    నా బావ చనిపోయాడన్న వార్త తెలియగానే, అప్పటి వరకు లోలోపల ఏడ్చిన నేను భాదని ఆపుకోలేకపోయాను.

    ” ఆహ్‌హ్‌హ్‌హ్‌హ్‌హ్‌హ్‌….” పెద్దగా ఆరుస్తున్నాను.

    ” టాష్‌ష్‌ష్‌…” గాజులు పగిలాయి.

    ” బొట్టు చెరిగింది, నాకింకా పెళ్ళి కాలేదు.

    ” బావా…” ఆని అరుస్తూ ఏడుస్తున్నాను.

    ” బావా..బావా..బావా..”

    ” హు హు హు హు…బావా…” నా ఏడ్పు ఆగట్లేదు.

    కళ్ళు తెరిచి చూసే సరికి నేనొక మంచం మీద పడుకుని ఉన్నాను.

    ఏడ్చి ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోతే మంచం మీద పడుకోపెట్టినట్టున్నారు.

    ” బావ గుర్తొస్తున్నాడు ”

    ” ఇప్పుడు నేనొక విదవరాలిని ”

    ” నాకు నా బావే ప్రపంచం ”

    ” నాకు నడక నేర్పించింది మా బావే ”

    ” నన్ను ఇలా తీర్చిదిద్దింది మా బావే ”

    ” బావ చనిపోయిన తరువాత రోజు నుండి 7 రోజుల వరకు నా నుదిటి మీద బొట్టు లేదు ”

    ” చేతులకి గాజులు లేవు, 7 రోజులు తెల్ల చీరే కట్టుకున్నాను ”

    బావ పుట్టిన రోజు ఆ రోజు (అక్టోబర్‌ 8) , బావ చనిపోయి 8 రోజులు అవుతుంది, సమయం రాత్రి 8 అవుతుంది.

    మా వాళ్ళు అందరూ మా బావ ఫోటో దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు.

    నేనూ మా బావ ఎంత బాగా కలిసి ఆడుకునేవాళ్ళం, చిలిపిగా కొట్టుకునేవాళ్ళం.

    నాకు ఆకలేస్తే తినిపించేవాడు, నాకు జ్వరం వస్తే ఒక తల్లిలా చూసుకునేవాడు.

    ” బావా… ఐ లవ్‌యూ బావా ”

    ” హు హు హు హు..” అని ఏడుస్తూ తలుపుకి ఒరిగాను.

    ” ఊరుకో ప్రియా ..నీకు నేను ఉన్నాను కదా.” అని నన్నెవరో భుజం తట్టారు.

    నాకు నా బావ స్వరంలా అనిపించి వెనక్కి తిరిగి చూస్తే మా బావ.

    ”బావా…” అని లేచి పరుగెత్తుతూ బావని గట్టిగా హత్తుకున్నాను.

    ” నా నుదిటిపై బొట్టు పెట్టాడు ”

    ” చేతికి గాజులు తొడిగాడు ”

    ” కొత్త పెళ్ళి కూతురిలా తయారయ్యాను , అందరి సమక్షంలో బావ నా మెడలో తాళి కట్టాడు ”

    అమెరికా నుండి అప్పుడే వచ్చిన మా చిన్న మామయ్యని పట్టుకుని అందరూ ఏడ్పు మొదలుపెట్టారు.

    తన పనిలో తను ఉన్న మా ”పెద్ద మామయ్య”( మా బావ తండ్రి) మా చిన్న మామయ్యని చూడగానే చేతిలో ఉన్న కట్టెలని వదిలేసి

    ” తమ్ముడూ…” అని ఏడుస్తూ మా చిన్న మామయ్యని వాటేసుకున్నాడు.

    ”ఊరుకో అన్నయ్యా…ప్రియ ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదు ”

    అని ఇంటి లోపలికి కదిలి అక్కడ ” బావ ఫోటో పక్కన ఉన్న నా ఫొటోకి, బావ ఫోటోకి” పూల దండ వేసాడు.

    ” పెళ్ళి కాని వితంతువు చనిపోయింది ”

    తన బావని విడిచి ఉండలేక తను కూడా తన బావ దగ్గరికి వెళ్ళిపోయింది.

    ” తన ఆశ భూమి మీద కాకపోయినా స్వర్గంలో దేవతలందరి సమక్షంలో తను కోరుకున్న అతనితో పెళ్ళి జరిగింది.”

    ” చచ్చి సాధించటం అంటే ఇదేనేమో ”

    తన బావలని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మరదల్లందరికి నా ఈ కథ అంకితం.

  • క్షమించండి మీ రిషికేశ్వరి

    ఆప్యాత అనురాగాలకి మా ఇల్లు ఓ పొదరిల్లు. అమ్మనాన్నకి నేను ఒక్కదాన్నే అవ్వడంతో చాలా ప్రేమగా పెంచారు. వారి ప్రేమకి ఏ రూపాన రుణం తీర్చుకోను అనిపించేది. కొన్ని లక్షల సార్లు అనుకున్న- బాగా చదివి ఓ స్ధానాన్నిసంపాదించి మా వాళ్ల ఆనందానికి కారణం అవ్వాలని. నా 21 సంవత్సరాలు మా అమ్మనాన్న ప్రేమతో , స్నేహితుల ప్రోత్సాహంతో చిన్న చిన్న అలకలతో సంతోషంగా సాగింది. అవ్వన్నీ ఎప్పటికీ మరిచిపోని అనుభూతులు. ఈ రోజు నేను సాధించాలనుకున్న నా జీవిత ఆశయానికి ఓ అడుగు ముందుకు వేసాను. ఆ అడుగు వేసేటప్పుడు తెలియలేదు. మళ్లీ ఇంటికి చేరుకోలేనని చదువు కోసం నా వాళ్లను వొదిలి బయటికి అడుగు పెట్టిన నేను తిరిగి రాని లోకాలకు వెళ్తానని ఉహించలేదు. క్షమించండి. అమ్మా, నాన్న! నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను!

    కాలేజి, ఇక్కడి వాతావరణం, ఇక్కడి మనుషులూ నచ్చడం లేదు అమ్మ నాన్న. ఓ ఆడపిల్లని మానసికంగా వేధించుకున్న పాపం ఊరికనే పోదు. నా పట్ల తప్పుగా ప్రవర్తించిన వారికి శిక్ష పడాలి. నాలా ఏ అమ్మాయి బాధపడకూడదు. ర్యాగింగ్ ఓ పెనుభూతం. యూనివర్సిటి ఓ నరకం. సాటి ఆడపిల్లపై మరో సాటి అమ్మాయే దురుసుగా ప్రవర్తించడం. సీనియర్స్ అంటూ రెచ్చిపోవడం. మేము చెప్పింది వినకపోతే నీకు బతుకే లేకుండా చేస్తాం అని బెదిరించడం. ప్రతి ఒక్కటీ భరించాను. మోయలేని బరువు. ఎంతో మానసిక క్షోభకు గురై ఈ పని చేస్తున్నాను.

    నన్ను తప్పుగా చూపించి వీడియోలు తీసి నా బతుకుని నగ్నంగా చూపించిన ఈ మనుషుల మధ్య బతకలేక పోతున్నాను. ఏ నాటికైనా నేను అనుకున్నది సాధించి అమ్మనాన్నలని సంతోషంగా చూసుకోవాలని అనుకున్నా కాని నా వల్ల మీ పరువు ని పోగొట్టుకునే పరిస్ధితి వచ్చింది. క్షమించండి!అమ్మనాన్న వెళ్ళిపోతున్నాఅంటూ ఆఖరి శ్వాసని విడిచాను. ఇంతకన్నా ఏం చేయాలో తెలీలేదు. మరో జన్మంటూ ఉంటే మళ్లీ మీకే కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నాను. సెలవు.

    ఇంతకీ నేను ఎవరో తెలిసింది కదూ మీ అందరికి? అన్యాయంగా ప్రాణం తీసుకొని ఎవరికీ ఏమీ కాకుండా మిగిలిన రిషికేశ్వరి.

  • నా తొలి ప్రేమ లేఖ

    ఇదిగో ఈ క్షణం కేవలం నీకోసం మాత్రమే ఆలోచించాలనిపిస్తుంది. తెలియని ఆనందం. అది ఈ వేళ నా తొలి ప్రేమ లేఖగా మారింది. నా తొలి ప్రేమలేఖే కాదు, నా చివరి ప్రేమ లేఖ కుడా నీకేనేమో ! ఎందుకంటే నవ్వు నన్నూ – నేను నిన్ను ప్రేమించుకునంతగా ఎవరు ఎవరిని ప్రేమించలేరేమో. ప్రేమించినా కూడా అది మన ప్రేమ అంత గొప్పది కాలేదేమో. అది గొప్పది అన్నా కూడా నేను ఊరుకోనుగా ! నీతో గొడవ పడినట్టే వాళ్ళతోనూ గొడవ పెట్టేసుకుంటా.

    అవును, అసలు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాను ? నీ బాహ్య సౌందర్యానికా ? లేక నీ మేదస్సుకా? రెండింటికినేమో ! ఎందుకంటే నేను అన్నీ నీ దగ్గర నుండే నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. మరి రెండిటినీ పొగడాలి కదా.

    అందమైన మోము, హాయినయిన చిరునవ్వు, స్వచ్ఛమైన మనసు, ఇవి చాలదా నీ గురించి చెప్పడానికి. ఇక నీ మేధస్సు ? ఆహ ! చెప్పనకర్లేదు. నా ప్రశ్నలన్నిటికి నువ్వే సమాధానం. నా కొచ్చే ఆపదలను నన్ను- నేనుగా తీర్చుకునేల చేసేది నువ్వే కదా ! నన్ను ఆనందంగా భరిస్తావు. ఆప్యాయంగా దగ్గర తీసుకుంటావు. ఇవి చాలదా నిన్ను ప్రేమించడానికి. అవును, ఇవే నా ప్రేమకి అర్హతలు. నేనే కాదు -నువ్వు కుడా నన్ను చూసిన మొదటి క్షణం నుండి నాలాగే ప్రేమిస్తునావు.నాకంటే ఎక్కువే ప్రేమిస్తునావు అనుకో.

    నాకింకా గుర్తుంది. నా ఎడుపుతోనే మన ప్రేమ మొదలైంది. నా కన్నీరే మన ప్రేమకు శ్రీకారం చుట్టింది.ఆ ఒక్క రోజే నేను ఏడ్చాను. నా ఏడుపు చూసి నువ్వు ఆనందించావు.

    నేను ఎప్పుడయినా ఎలాగైనా నీతో ఉండొచ్చు. ఏ క్షణమైనా నిన్ను విసిగించేయోచ్చు. ఎందుకంటే మన ప్రేమకి ఏ హద్దులు లేవుగా !

    నా సుఖాలనే కాదు నా కష్టాలను కుడా స్వీకరిస్తావు.రోజుకోసారి i love you లు చెప్పుకోకపోయినా మన ఇద్దరి మనసులో ఉండే మాటే అది. రోజు శికారులకి వెళ్ళము. గిఫ్టులు ఇచ్చుకోము. అలా ప్రేమిస్తేనే ప్రేమంటార? అయితే అది నా దృష్టిలో నకిలీ ప్రేమే ! అలా అనుకోవడం కూడా నేరమే. రోజు ప్రత్యేకంగా కలుసుకోము. కలుసుకోవడమేంటి? అసలు దూరంగా ఉంటేనేగా కలుసుకునేది.

    ఇదిగో ఎవ్వరు మన ప్రేమకి దిష్టి పెట్టనంటే నిన్ను నా ప్రపంచానికి పరిచయం చేసేస్తా. అది ఎవరో కాదు మా ‘ అమ్మేనని.’

    అవును ! నా ఈ ప్రేమలేఖ మా అమ్మకే. ఈ ప్రేమలేఖలోని ప్రతి మాట నిజమే. కావాలంటే మళ్లీ చదవండి.

    అమ్మ . . .

    నీకు వంద కౌగిలింతలే ఇవ్వనా? వెయ్యి పాదాభి వందనాలే చెప్పనా?
    మన ప్రేమ ఇలాగే శాశ్వతంగా నిలిచిపోవాలని కోరుకుంటూ . .

    నీ ప్రియమయిన,

    రాక్షసి . . . !

  • నేనంటే అంత చులకనెందుకు

    లోకంలో అందరితో పాటు నేను ఉన్నాను అనుకున్నాను…  కాని ఒ మనిషిలా కాదు ఎవరికి ఏమి కాని ఒ వింత జీవిలా అని ఈ మధ్యనే తెలిసింది… ఇంతకు నేను ఎవరో చెప్పలేదు కదూ… నేనో కాటికాపరిని… చావులు చేస్తాను. పుట్టుకను దేవుడు ఇస్తాడు … మరణాన్ని దేవుడే ఇస్తాడు. ఓ జీవి ఈ లోకంలోకి అడుగు పెడుతున్నడు అంటే ఎక్కడ లేని సంతోషం మనలో కలుగుతుంది.. అలాగే మనకి ఎంతో ఆప్తులైన వారు దూరం అయిపోతే బాధపడతాం. ఆత్మయులు మీ నుండి దూరమైతున్న ఆ క్షణం  ఎంతగానో క్రుంగదీస్తుంది కాదనడం లేదు… కాని అ క్షణం  మేము డబ్బులు  అడిగి తీసుకుంటాం… మీ ముఖల్లో ఒ చిరాకుని చూసాను అసలే బాధపడుతుంటే మధ్యలో వీడి గొడవ ఎంటన్నమీ ప్రశ్న నన్ను తాకింది…  మరి మేము మనషులమే కదా బతకాలంటే జీవనాధారం కావాలి గా?  మాకా ఈ పని తప్పితే వేరే పని రాదాయ్యె …  మీ ఆత్మీయులని దూరం చేస్తున్నాం  అని కోపం కాబోలు ….  మాకు  దేవుడు ఎవరో కాదు… ప్రతి రోజు మేము చితిపై పగుకోబెట్టె మీ ఆత్మీయులే. వారు ఈ లోకాన్ని విడుస్తు మాకు జీవితాన్ని ఇస్తున్నారు.. వారి చావు ద్వారా వచ్చిన డబ్బె మాకు ఆధారం.

    ఏ రూపానా మేము వారి రుణం తీర్చుకోగలం క్షేమంగా పంపడం తప్పితే… మేము లేకపోతే మీవాళ్ళని సాగానంప గలరా? …  ఒ మనిషిని దాహనం చేయాల్సి వచ్చిందే అని బాధ పడని రోజు లేదు… మీ సంతోషాన్ని మీకు దూరం చేస్తున్నాని బాధ నేను వున్నంత వరకు నన్ను వెటాడుతూనే ఉంటుంది. రేపు నేనైన పోతానుగా మీమల్నీ బాధ పెడితే క్షెమించండి కాని తక్కువ చేసి మాట్లడాకండి .మీ వాళ్ళని మేము వృత్తిలా భావించి సాగనంపడం లేదు … వారే మా భవిషత్తు అని గుర్తుపెట్టుకోని  బాధ్యతతో… పంపుతాం… మాకు జీవితాన్ని ఇచ్చిన వారికి బదులుగా రుణం తీర్చుకుంటున్నాం అంతే…

    ఇదండీ ఒ కాటికాపరి వాడి జీవితం రోడ్ పై అక్సిడంట్ జరిగితే ఒ పదిమంది పొగువుతారు. అప్పుడు కేవలం సాటి మనిషిలా మానవత్వం చూపుతాం కాని వారిది ఏ కులం ఏ మతం అని అలోచించాం కదా?  గోప్పవాడు చనిపోయిన బిదవాడు చనిపోయిన అంతక్రియ పక్రియలో మార్పు లేదుగా… మనిషి పుట్టక కులాలు మతాలు పుట్టాయి గాని కులాలు.. మతలు పుట్టక మనం పుట్టాలేదు గా… కులాలు,మతలు అని వేరు చేసి చూస్తే ఆఫీస్ లో కోలీగ్ పక్కన కూర్చోవలన్న ఆలోచిస్తారు కాబోలు … ఈ గోడవలకి అన్నెం పుణెం ఎరుగని పసిపిల్లలు బలైతున్నారు. చదువుకోవాలంటే భయం సరదగా పక్క పిల్లవాడి తో ఆడాలంటే భయం.. పెద్దవాళ్ళుగా మనం ధైర్యం చెప్పాలే గాని దీనికి వోత్తాసు పలుకి చిన్నపిల్లలా బంగారు భవిష్యత్తు పడుచేయడం ఎంత వరకు సబబో ఆలోచించండి.