జర్నలిస్టు అవుదామనుకుంటుంన్నారా? అయితే ఇవి తెలుసుకోండి…

Basics of Journalism. Myth vs Reality

వాస్తవాలను తెలియపరచడమే జర్నలిజం కాదు. ప్రయోజకరమైన కధనాలను ప్రచురించడం, ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించేలా చేయడం, ప్రజల తమంతట తాము నిర్ణయాలు తీసుకునే విధంగా సమాచారాన్ని అందించడం జర్నలిజం.  ఈరోజుల్లో జర్నలిస్ట్ అవ్వడం ఏలా? మీరు విద్యార్ధా, లేదా కెరీయర్ ను మార్చుకోవాలనుకుంటున్నారా, లేక మీకు ఈ రంగం మీద అమితాశక్తా, అయితే జర్నలిజంలో ప్రాధమిక అంశాలు తెలుసుకోవడానికి ఈ వ్యాసం మీకు ఉపయోగపడుతుంది.

అపోహ-వాస్తవం: ఏది జర్నలిజం?(ఏది కాదు?)

  • అపోహ: జర్నలిస్టులు కేవలం వార్తలే రాస్తారు.
  • వాస్తవం:. ప్రజలకు తెలియని, తెలియాల్సిన విషయాలను పరిశోధన, ఇంటర్యూలు ద్వారా తెలియజేయడం. విషయవాస్తవికతను నిర్దారించి, పలు మాధ్యమాలలో అనగా డిజిటల్, బ్రాడ్ క్యాస్ట్,సోషల్ మీడియాలో కధనాలను చెప్పడం జర్నలిజంలో భాగాలు.
  • అపోహ: జర్నలిజం అంతరించిపోతుంది.
  • వాస్తవం: పత్రికల ప్రచురణ తగ్గి,  డిజిటల్ జర్నలిజం, ఇన్వెష్టిగేటివ్ రిపోర్టింగ్, వీడియో స్టోరీస్గా రుపాంతరం చెందుతున్నాయి.విశ్వసనీయ సమాచారానికి ఉన్న అవసరం ఏమాత్రం తగ్గలేదు.
  • అపోహ:జర్నలిస్ట్ అవ్వాలంటే మీకు జర్నలిజంలో డిగ్రీ తప్పనిసరి.     
  • వాస్తవం:డిగ్రీ ఉపయోగకరమైనప్పటికీ, స్యీయ అధ్యయనం, ఉద్యోగ అనుభవం ద్వారా నేర్చుకున్న ఎందరో జర్నలిస్టులు ఇప్పుడు విజయవంతంగా రాణిస్తున్నారు.  అన్ని వేళల్లో సమర్ధవంతంగా ఆలోచించడం, రాయడం, ప్రచురించడం ఇక్కడ ప్రధానం.

జర్నలిస్ట్ కావాలనుకునేవారికి ఉండవలసిన నైపుణ్యాలు

వీటిని మీరు ఆకలింపు చేసుకుంటే మీరు జర్నలిజంలో విజయం సాధిస్తారు.

  1. రచనా నైపుణ్యం– స్పష్టంగా, సంక్షిప్తంగా, వినియోగదారులను ఆకట్టుకునేలా రాయగలగాలి.
  2. పరిశోదన, వాస్తవ నిర్దారణ- రిపోర్ట్ చేసే అంశం వాస్తవమైనదా, విశ్వసనీయమైనదా లేదా సరిచూసుకోవాలి.
  3. ఇంటర్వూ మెలుకువలు-అర్ధవంతమైన సమాధానాల కోసం సరైన ప్రశ్నలను అడగగలగాలి.
  4. వీడియో, ఆడియో నిర్మాణం-వార్తను చిత్రించడం, వార్త కధనాలను రాయడం ద్వారా మల్టీమీడియా యుగంలో ముందుండవచ్చు.
  5. అనుకూలత– మారుతున్న మీడియాలో మార్పులకు తగ్గట్టుగా జర్నలిస్ట్ తనని తాను అలవరచుకోవాలి.

ప్రారంభించడం ఎలా?

జర్నలిజం పట్ల మీకు నిజమైన ఆశక్తి ఉంటే, మీరు చేయవలసిన కొన్ని పనులు.

  1. రాయడం ప్రారంభించడం– ఒక బ్లాగ్ ను ప్రారంభించడండి, ఏదైనా మాధ్యమంలో రాయండి. మీరు ఎంత ఎక్కువ రాస్తే అంత బాగా రాస్తారు.
  2. వార్తలను అనుసరించండి– కొత్త విషయాలను, ఘటనలను తెలుసుకోవడంలో ముందుండండి, ఒకే కధనాన్ని వివిధ మాధ్యమాలు ఎలా ప్రచురిసున్నాయో గమనించండి.
  • విడియోలతో ప్రయోగం చేయండి.- మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ఉపయోగించి రిపోర్టింగ్ చెయ్యవచ్చు. మీరే వీడియోలను రికార్డ్ చేసి వాటిని ఎడిట్ చేయండి.
  • పోర్ట్ ఫోలియోను నిర్మించుకోండి– ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నపుడు వాటిలో మీరు రాసిన లేదా చిత్రించిన వాటిని ముందుంచండి.
  • జర్నలిజంలో శిక్షణను పరిగణించండి– మీడియా రంగంలో మీకు అన్నివిధాలుగా శిక్షణ ఇచ్చి మీ యొక్క భవిష్యత్తుకు తమ వంతు సహాయం చేసేందుకు  ఏ. పీ . కాలేజ్ ఆఫ్ జర్నలిజం సమగ్ర శిక్షణ పధ్దతులతో, సాటిలేని చరిత్రతో మీకు అందుబాటులోనే ఉంటుంది.

చివరిగా

జర్నలిజం సవాళ్లతో కూడుకున్నా లాభధాయకమైన ఉద్యోగం. మీరు కధనాలు, నిజాలను చెప్పి మీకంటూ ఒక ఫ్రత్యేకత ఉండాలి అని కోరుకునే వాళ్లు అయితే ఈ రంగం మీ కోసమే.  ఆసక్తితో అడుగేయండి, నిత్యవిద్యార్ధిగా ఉండండి, రిపోర్టింగ్ మొదలు పెట్టండి- ప్రపంచం గొప్ప జర్నలిస్ట్ ల గురించి వేచి చూస్తుంది.