చైల్డ్ అంటేనే పసితనం అందరిలా సాటిపిల్లల్ని చూస్తూ అనందంగా ఆటపాటలతో గడిపే వయస్సులో కష్టాన్ని నమ్ముకుంటూ బ్రతుకు బండిని మోసేవారిలో ఈ పసిపిల్లలే ఎక్కువుగా కనిపిస్తున్నారు. ఈ వయస్సులో ఏం తెలుసు అని ఇలాంటి జీవితాన్ని చూస్తున్నారు? బ్రతుకు బండిని నడిపేదే డబ్బు ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి కటిక బిదవాడి దగ్గర నుండి ఏడు అంతస్తుల మేడలో ఉన్న గొప్పవాడికి కూడా డబ్బులేనిదే పూటగడవదు. ఉన్నవాడికి వాడికి డబ్బు విలువ తెలీదు. లెనివాడికి డబ్బు విలువ తెలిసినా ఆ విలువని కాపాడుకోవాలని ఉన్నా చేతిలో చిల్లిగవ్వ ఉండదు. ఏ మనిషైనా జీవించడానికి మూడు కారణాలు – (1)తినడానికి తిండి (2)కట్టుకోవడానికి గుడ్డ (3)ఉండడానికిచోటు (ఇళ్లు).
ఇంతకన్నా అవసరాలు ఏం ఉంటాయి?ఓ పేదవాడికి వీటికి సరిపడా డబ్బు ఉంటే చాలు అంతకన్నా గొప్పగా అలోచించలేడు. అలా అలోచించాలి అనుకున్న తన జీవన శైలిని గుర్తు చేసేవారెే ఎక్కువ ఆ అలోచనకి అలవాటు పడిపోతున్నారు. పిల్లలు మంచికీ, చెడుకీ తేడా తెలీని వయస్సులో అభం శుభం తెలియని చిన్నారులని ఏ కూలి పనికి పంపడమో లేక ఎవరి కిందనో ఒక బానిస గా పనికి పంపడం లాంటివి చేస్తున్నారు. తల్లేమో ఆ ఇంటా, ఈ ఇంటా పాచి పని చేస్తే, తండ్రి తాగుడికి బానిసై కట్టుకున్న భార్యనీ, తని బిడ్డనీ అంగడిలో సరుకుగా బేరం కుదిరించుకుంటాడు. ఇటు వీళ్ల చేతగాని తనం వల్ల పసిపిల్లలు తమ బాల్యంలోనే పేదరికాన్ని ఎదుర్కోంటున్నారు. హోటల్లో పనిచేస్తూ ఇళ్లల్లో పనిచేస్తూ కూలి పనులకి వెళ్తూ ఇంటికి ఆసరాగా నిలుస్తున్నారు.
ఫ్వాక్టరీల్లో పనిచేస్తూ యంత్రాల్లో చేలి వేళ్లు పోగోట్టుకొన్న పిల్లలను చూస్తే జాలి వేస్తుంది. కానీ, ఏం లాభం! కెేవలం జాలి పడడానికి ఉంటాం అంతకన్నా ఏమి చేయ్యలేం అంటూ చేతులు దులుపుకుంటారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా ఈ పరిస్థితుల్లో మార్పు ఏ మాత్రం లేదు.
కల్మషం లేని మనస్సుగా గుర్తిస్తారు పిల్లలని. మరి ఈ పసితనంలోనే వారి అలోచనలూ, పద్ధతులూ ఒక్కోసారి పెద్దవాళ్ళ ధోరిణిలాగే అనిపిస్తుంది. ఓ యజమాని తన పనికోసం ఓ పసివాడిని పనిలో పెట్టుకుంటాడు. స్కూల్లో ఓ విద్యార్ధే తన సాటి విద్యార్ధి పై చులకన భావం చూపడం… తన బ్యాగు, టిఫిన్ డబ్బాని అవతలి వాడికి ఇచ్చి తెమ్మని చెప్పటం వంటివి చూస్తునే ఉంటాం. అంటే ఇక్కడ వాడికి నాకన్నా తక్కువ అన్న బావన. రైతు వల్లే మనకి తిండి దొరుకుతుందన్నది ఎంత సత్యమో, ఈ లేబర్ వల్లే గొప్ప ఇంటి వారి పనులు సకాలంలో జరుగుతున్నాయి అన్నదీ అంతే వాస్తవం.
చిన్నతనంలోనే తమ కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకుంటూ బాధ్యత తీసుకొని పనికి వేళ్ళే పిల్లలు ఉన్నారు. వాళ్ళ అవసరాలకి తల వొంచి ఒకరి దగ్గర పని చేస్తే ఆ యజమానులు మాత్రం వాళ్ళని చులకనగా చూస్తూ ఆడపిల్లలపై ఆత్యాచారాలు చేస్తున్నారు. ఏ మాత్రం కనికరం లేని ఇలాంటి మృగాలకి అభం శుభం తెలియని పసి పిల్లలు బలి అవుతున్నారు వయస్సుకు మించిన బరువు మోస్తూ బ్రతుకుని భారంగా ఈడ్చుకెళ్ళుతున్నారు.
చదువుకున్న వాడు పైకి రాగలడానికి కారణాలు ఏమిటి? మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు అని అడిగితే ఏం చెబుతారు? తమ గురువుల పేర్లో, తమ తల్లిదండ్రుల గురించో చెబుతారు. అదే ఒక చైల్డ్ లేబర్‌ని నీ స్థితికి గల కారణం ఏమిటీ అని అడిగితే ఏం చెబుతారు? అస్సలు చెప్పగలరా? ఏమో, ఇంట్లో అయ్య చెప్పిండు పనికి వెళ్ళమన్నాడు అంటారు. పిల్లలకు మంచికీ, చేడుకీ తేడా తెలియజేసేటట్లుగా వాళ్ళలో నైపుణ్యాన్ని పెంచగలిగాలి. దీనికి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు పుస్తకాల్లో పాఠాల్లాగ నేర్పించగలిగితే ఇందులో కొంతవరకైనా మార్పులు రావచ్చు.
లేబర్ గా ఎదిగే పిల్లలలో ఏదో ఓ కథ దాగి వుంటుంది. దాన్ని తెరిచి చదవడం మొదలు పెడితే అందులోని లోటుపాట్లు తెలుస్తాయి. ఈ చైల్డ్ లేబర్‌ని అరికట్టాలంటే అందరిలోను దీనిపై అవగాహన పెంచాలి.