Tag: Nirbhaya

  • కథ: నిర్భయ పంజా దెబ్బ

    ఆ రోజు సాయంత్రం 8 అవుతుంది.

    మా ఆంటీ వాళ్ళింటికి వచ్చాను ఒక్కదాన్నే.

    మెరుపులకి తన కొడుకు అయినటువంటి ఆకాశం మీద కోపం వచ్చింది.

    ఆకాశంకి భాద కలిగింది, సమస్త ప్రాణలకి మాత అయినటువంటి భూమాత భాద కలిగింది.

    అమ్మా, నాన్న నన్ను కొట్టారు అని రుజువుగా కన్నీళ్ళు కారుస్తుంది ఆకాశం.

    ‘వెళ్ళొస్తాను ఆంటీ, వర్షం తగ్గేలా లేదు, మా ఆయన ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు’.

    ‘రేపు పొద్దున వెళ్ళొచ్చు కాని ఉండమ్మా’.

    ‘లేదు ఆంటీ, ఇంటి దగ్గర పిల్లలు నేను లేకుంటే ఏడుస్తారు. వెళ్ళొస్తాను ఆంటీ ఏమనుకోకండి’, అని ఇంటికి బయలుదేరాను.

    అలా కాలు బయట పెట్టానో లేదో..ఒక పెద్ద పిడుగు మా ఆంటీ వాళ్ళింటి పక్కన ఉన్న టవర్‌ మీద పడింది.

    నాకు ఒక్కసారిగా గుండె జారినంత పనయ్యింది.

    మెరుపులకి ఆకాశం మీద కోపం తగ్గనట్టుగా ఉంది. ఇంకా ఆకాశంపై నిప్పులు వెదజల్లుతున్నాడు.

    ఆంటీ వాళ్ళు ‘తాడపత్రి’ అనే మండలంలో ఉంటారు. మాది ‘ఊళ్ళూరు’ అనే కుగ్రామం. మాకు ఆంటీ వాళ్ళు దూరపు బందువులు. దూరపు బందువులు అన్న మాటే కాని దగ్గర వాళ్ళలా మసుకుంటాము. మాది పేద బతుకులు. డబ్బులు అవసరం ఉండగా ఆంటీ దగ్గర అప్పుగా తీసుకుందామని వచ్చాను.

    సమయం రాత్రి 9.05 అవుతుంది. మా ఆంటీ వాళ్ళింటి నుండి మా ఇల్లు 5 కి.మీ.

    ఆటోలు తప్ప మరింకేమి ఉండవు.

    ఆకాశంకి భాద ఎక్కువయినట్టుంది, చాలా జోరుగా విలపిస్తున్నాడు. ఆ కన్నీళ్ళకి నేను మొత్తం తడిసి ముద్దయిపోయాను

    ఆ తడికి నా శరీరం అంతా చల్లబడిపోయింది. చలికి వణికిపోతున్న సమయంలో పెద్దగా అరిచాయి మెరుపులు.

    దబేళ్‌..!
    ఒక్కసారిగా అటు పక్కనే ఉన్న తాటిచెట్టు కుప్ప కూలింది. నాకు ఏం చేయాలో తోచట్లేదు.

    సింహంలా గర్జిస్తున్న ఆ మెరుపులకి ఎన్నడూ రాని భాద ఈ రోజే వచ్చినట్టుగా విలిపిస్తున్న కన్నీళ్ళకి భయపడి ఒక్క ఆటో కూడా రావట్లేదు.

    దూరంలో ఏవో లైట్స్‌ వెలుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒక్కసారిగా నా గుండె 205 సార్లు కొట్టుకోవడం ఆగిపోయి ఎదా స్థితికి వచ్చి కొట్టుకోవటం మొదలుపెట్టింది.

    ఏదో వాహనంలా ఉంది, నా అదృష్టం కొద్ది ఆ వాహనం నేను వెళ్ళే దారి మీదుగానే వెళుతున్నట్టుగా ఉంది. ఆపమనట్టుగా చేతితో సూచించాను కాని ఆ కారులో ఉన్న వ్యక్తి చూసి చూడనట్టుగా కారుని పక్కకి తిప్పుకుని వెళ్ళిపోయాడు.

    ‘ ఛా..! ఎదవ..ఒక ఆడది ఒంటరిగా ఉంది, సహాయం చేద్దామని లేదు’ అని అతన్ని తిట్టుకుంటూ ఉండగా.

    జఫ్‌ఫ్‌ఫ్‌ఫ్‌..
    నీళ్ళల్లో బ్రేక్‌ వేసేసరికి కారు టైర్లు  జారాయి. కొంచెం దూరంలో ఆ కారు నాకు సహాయం చేస్తానన్నట్టుగా వేచి చూస్తుంది.

    నేను ఆ జోరు వానలో మొత్తం తడిసి ముద్దయి పోయాను. గబగబా పరుగెత్తుతూ కారు దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే కారు ఫ్రంట్‌ డోర్‌ ఓపెన్‌ చేయగానే లోపల కూర్చుని నా కొంగుతో తుడుచుకుంటున్నాను.

    ‘చాలా థ్యాంక్స్‌ అండీ, ఈ తుఫాన్‌లో ఎవ్వరూ రాట్లేదు, ఒక్క వాహనం కూడా రాట్లేదు అని భయపడుతున్న సమయంలో దేవుడిలా వచ్చారు, చాలా థ్యాంక్స్‌ అండీ’

    ఇట్స్‌ ఓకే! ఆని ఇంగ్లీష్‌లో సమాధానమిచ్చాడు.

    అతను చాలా పెద్ద మనిషిలా ఉన్నాడు. చూడటానికి చాలా డబ్బున్న వానిలా కనిపిస్తున్నాడు.

    ‘ఎక్కడి వరకు వెళ్ళాలమ్మ’ ? అని ఆ పెద్దమనిషి మందలించాడు.

    ‘ఊళ్ళూరు వరకు వెళ్ళాలండి’ అని చెబుతూ కొంగుతో తుడుచుకుంటున్నాను.

    ‘అవును, ఇంత రాత్రి వరకు ఇక్కడేం చేస్తున్నావమ్మ?’

    ‘ఇక్కడ దగ్గరలో మా ఆంటీ వాళ్ళు ఉంటారు, కొంచెం పని మీద వచ్చి ఈ వానలో ఇరుక్కుపోయానండి’

    బాగా తడిసి ఉండటం వల్ల నాకుండే కొంచెం సిగ్గు కాస్త పెరిగి మూడింతలు అయ్యింది. నా కొంగుతో అలా తుడుచుకుంటూ ఉండగా అతను నన్ను ఓరగా దొంగ చూపులు చూస్తున్నాడు. నా కొంగుతో నా ఒంటిని దాచుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. కాని ఆకాశం భాద నన్ను ఈ రోజు ఇలా ఇరుక్కునేలా చేసింది.

    మామూలుగా ఉంటేనే చూడకుండా ఉండలేని మగాళ్ళు(ఎవరో కొందరు) ఇక నిండా తడిసి ఉంటే చూడకుండా ఉండగలరా..!

    ఏదో చూస్తున్నట్టుగా నన్నే పదే పదే చూస్తున్నాడు.

    కావాలనే నన్ను తాకుతున్నాడు.

    ‘దేవుడా నన్ను రక్షించు’ అని మనసులో అనుకుంటూ ఉండగా,

    డగ్‌..డగ్‌..డగ్‌..డగ్‌… కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. కారు డోర్స్‌కి లాక్స్‌ ఆటోమేటిక్‌గా పడిపోయాయి. అప్పుడు అర్థమైంది కారు ఆగిపోలేదు, ఆపేసాడని. చిరుత చాలా ఆకలిగా ఉంది. జింక పిల్ల కన్పించింది. ఎలాగైనా వేటాడి చంపి తినేయాలని చూస్తుంది.

    ఆ వ్యక్తి నా దగ్గరికి వస్తూ ‘నీకెంత కావాలంటే అంత ఇస్తాను, ఈ ఒక్క రాత్రి నాతో సహకరించు’.

    చేపని పట్టుకోవటానికి డబ్బుని ఎరగా వేయాలనుకుంటున్నాడు. ఎరకి పడిపోటానికి దానికి నాకు ఒక్కటే తేడా

    ‘అది చేప, నేను ఆడదాన్ని’.

    నాకు కోపం ఆగలేదు.

    ‘ముండ కొడకా..ఆడదంటే అంగడిలో వస్తువు అనుకున్నావారా..డబ్బులిచ్చి కొనుక్కోటానికి?’

    అతన్ని అలా తిట్టగానే నా చెంప చెల్లుమనిపించాడు. చిరుత చేతికి జింక పిల్ల దొరికింది. నన్ను చాలా బలవంతం చేస్తున్నాడు. ఇంకొక 2 కి.మీ అయితే మా ఊరి పోలీస్‌ స్టేషన్‌ వస్తుంది అనగా కారు ఆపేసాడు. చిరుత తన కౄరమైన పల్లతో జింక మెడని కొరకటానికి ప్రయత్నిస్తుంది. నా చీర మొత్తం విప్పేసాడు.

    ఆడదంటే మగవాడి కింద నలిగి పోవటమేనా? ఆడ జాతికి విముక్తి లేదా?

    జింక పిల్ల పోట్లాడి పోట్లాడి నీరసించిపోయింది. నా కంటి నుండి నీరు కారటం మొదలు అయ్యింది. ఈ పశువు మృగంలా ప్రవర్తిస్తుంది.

    నేనేమి చెయ్యలేనా? ఈ మగ జాతి మృగ పాలనికి అంతం లేదా?” అని ఏడుస్తుండగా నా చేతికి ఏదో వస్తువు తగిలినట్టుగా అయ్యింది.

    కారులో ముందట ఉన్న చిన్న డిక్కీలో ఉంది ఆ వస్తువు. అది ఏంటి అని చూడకుండానే, నా కాలితో అతని చాతి మీద తన్నాను. అలా తన్నగానే అతను నా దగ్గరి నుండి వేరే సీట్‌లోకి వెళ్ళిపడ్డాడు.

    నా చేతికి వచ్చింది ‘హ్యాండ్‌ గన్‌’.

    ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ట్రిగ్గర్‌ నొక్కాను.

    గన్‌లో ఉన్న బుల్లెట్‌ కాంతివంతమైన వేగంతో అతని గుండెల్లోకి దూసుకెళ్ళింది. ఆ బుల్లెట్‌ అతని రక్తాన్ని నా చీరపై చిల్లేలా చేసింది.

    అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. జింక పిల్ల చిరుత నుండి తప్పించుకుంది. కారుకి ఉన్న కీ తిప్పగానే కారు డోర్స్‌ అన్‌లాక్‌ అయ్యాయి. రక్తసిక్తమైన నా చీరని అలాగే కట్టుకుని కారు దిగి ఆ వానలోనే తడుచుకుంటూ మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళసాగాను. నాకేమి అర్థం కావట్లేదు.

    ‘నేను ఒక మృగాన్ని చంపానా? లేక మానవ రూపంలో ఉన్న మృగాన్ని చంపానా?’

    ఏది అయితేనేం చంపాను. మన దేశంలో మృగాన్ని చంపినా కేసే.

    అలా ఆలోచిస్తూ నడుస్తూ ఉండగా మా ఊరి చివర ఉన్న పోలీస్‌ స్టేషన్‌ వచ్చింది.

    నా చేతిలో గన్‌ అలాగే ఉంది.

    అలాగే లోపలకి నడుచుకుంటూ వెళ్ళాను. లోపల ఉన్న ఎస్‌.ఐ నన్ను అలా చూసి షాక్‌ అయ్యి కుర్చీలో జారిపడి టేబుల్‌ మీద కాళ్ళు పెట్టుకున్న అతను లేచి నిలబడ్డాడు.

    ఎస్‌.ఐ గారు నన్ను అత్యాచారం చేస్తుండగా నేను అతన్ని చంపేసాను. నన్ను అరెస్ట్‌ చేయండి, అని నా చేతిలో ఉన్న గన్‌ టేబుల్‌ మీద పెట్టి మూలకి వెళ్ళి కూర్చున్నాను.

    ఎస్‌.ఐ కి ఏం చేయాలో పాలుపోక కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.

    ఒక్కసారిగా ఎస్‌.ఐ, ‘ ఏయ్‌ 202… ఊరి చివర యాక్సిడెంటు అయ్యిందంట… వెళ్ళారా..?’

    ‘ఎఫ్‌.ఐ.ఆర్‌ రాసుకున్నారా యాక్సిడెంటు అని,ఇవి కూడా చెప్పాలా అయ్యా మీకు? త్వరగా చేయండి’.

    ఎస్‌.ఐ నా వైపు తిరిగి, ‘ఏంటమ్మా..నీ కేసు ఏంటి? నీ గొర్రె పిల్ల కనబడగానే కబురు పెడతాను కాని వెళ్ళమ్మా’.

    ‘ఏయ్‌..205..ఈవిడని వాళ్ళింటి దగ్గర దిగబెట్టి రాపో’.

    అలా ఎస్‌.ఐ నన్నురక్షించగానే నా కంటి నిండా నీరు, నాకు ఏడ్పు ఆగక ఆ ఎస్‌.ఐ కాళ్ళ మీద పడిపోయాను.

    నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్ళిపోయాడు.

    ఆడ వాళ్ళ మీద అత్యాచారాలు ఎన్నడు ఆగుతాయి? నిర్భయ చట్టం అమలులోకి వచ్చినా కాని ఇంకా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.మారాల్సింది సమాజమా ? లేక మగాడిని అని మురిసిపోతున్న మృగ జాతా?

    ఈ కథలో ఎస్‌.ఐ లాంటి మనుషులు ఉన్నంత వరకు ఆడ జాతికి అన్యాయం జరగదు.

    ఈ కథ కొందరిని ఉద్ధేశించి రాసినది మాత్రమే.

    ”జైహింద్‌”