ఆప్యాత అనురాగాలకి మా ఇల్లు ఓ పొదరిల్లు. అమ్మనాన్నకి నేను ఒక్కదాన్నే అవ్వడంతో చాలా ప్రేమగా పెంచారు. వారి ప్రేమకి ఏ రూపాన రుణం తీర్చుకోను అనిపించేది. కొన్ని లక్షల సార్లు అనుకున్న- బాగా చదివి ఓ స్ధానాన్నిసంపాదించి మా వాళ్ల ఆనందానికి కారణం అవ్వాలని. నా 21 సంవత్సరాలు మా అమ్మనాన్న ప్రేమతో , స్నేహితుల ప్రోత్సాహంతో చిన్న చిన్న అలకలతో సంతోషంగా సాగింది. అవ్వన్నీ ఎప్పటికీ మరిచిపోని అనుభూతులు. ఈ రోజు నేను సాధించాలనుకున్న నా జీవిత ఆశయానికి ఓ అడుగు ముందుకు వేసాను. ఆ అడుగు వేసేటప్పుడు తెలియలేదు. మళ్లీ ఇంటికి చేరుకోలేనని చదువు కోసం నా వాళ్లను వొదిలి బయటికి అడుగు పెట్టిన నేను తిరిగి రాని లోకాలకు వెళ్తానని ఉహించలేదు. క్షమించండి. అమ్మా, నాన్న! నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను!

కాలేజి, ఇక్కడి వాతావరణం, ఇక్కడి మనుషులూ నచ్చడం లేదు అమ్మ నాన్న. ఓ ఆడపిల్లని మానసికంగా వేధించుకున్న పాపం ఊరికనే పోదు. నా పట్ల తప్పుగా ప్రవర్తించిన వారికి శిక్ష పడాలి. నాలా ఏ అమ్మాయి బాధపడకూడదు. ర్యాగింగ్ ఓ పెనుభూతం. యూనివర్సిటి ఓ నరకం. సాటి ఆడపిల్లపై మరో సాటి అమ్మాయే దురుసుగా ప్రవర్తించడం. సీనియర్స్ అంటూ రెచ్చిపోవడం. మేము చెప్పింది వినకపోతే నీకు బతుకే లేకుండా చేస్తాం అని బెదిరించడం. ప్రతి ఒక్కటీ భరించాను. మోయలేని బరువు. ఎంతో మానసిక క్షోభకు గురై ఈ పని చేస్తున్నాను.

నన్ను తప్పుగా చూపించి వీడియోలు తీసి నా బతుకుని నగ్నంగా చూపించిన ఈ మనుషుల మధ్య బతకలేక పోతున్నాను. ఏ నాటికైనా నేను అనుకున్నది సాధించి అమ్మనాన్నలని సంతోషంగా చూసుకోవాలని అనుకున్నా కాని నా వల్ల మీ పరువు ని పోగొట్టుకునే పరిస్ధితి వచ్చింది. క్షమించండి!అమ్మనాన్న వెళ్ళిపోతున్నాఅంటూ ఆఖరి శ్వాసని విడిచాను. ఇంతకన్నా ఏం చేయాలో తెలీలేదు. మరో జన్మంటూ ఉంటే మళ్లీ మీకే కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నాను. సెలవు.

ఇంతకీ నేను ఎవరో తెలిసింది కదూ మీ అందరికి? అన్యాయంగా ప్రాణం తీసుకొని ఎవరికీ ఏమీ కాకుండా మిగిలిన రిషికేశ్వరి.

Keerthana M

One thought on “క్షమించండి మీ రిషికేశ్వరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *