ధమాల్..!

ఒక్కసారిగా పెద్ద అరుపు..

రక్తం ఏరులై సెలఏరులై పారుతుంది.

ఆ ఘటన చేసిన అతను కారు దిగి పారిపోయాడు.

”తన కంటి నిండా నీరు, ఏదో కోల్పోతున్నానన్న భాద, బ్రతకాలన్న పట్టుదల”

”తన చేతి వేళ్ళు చిన్న చిన్నగా కొట్టుకోవటం మొదలయ్యింది”

అటుగా వెళుతున్న జనమంతా ఆ ఘటన జరిగిన ప్రదేశం దగ్గర మూగారు.

ఏదో ఒక చిత్రం చూస్తున్నట్టుగా చూసున్నారే తప్ప, కాపాడటానికి ఒక్కరు కూడా ముందటికి రావట్లేదు.

” చేతి వేళ్ళు భూమిని తాకాయి, కళ్ళకి రక్షణగా ఉండవలసిన రక్షక భటులు ఒక్కసారిగా ఆగిపోయారు, నాలుగు గదుల అందమైన భవనం కుప్పకూలింది.”

”నా బొట్టు చెరిగింది, గాజులు పగిలాయి”

” కాని నాకింకా పెళ్ళి కాలేదు”

మూడు ముళ్ళతో అద్భుతంగా మొదలవుతుంది ఆనుకున్న నా జీవితం ఇలా అర్థాంతరంగా సమాప్తం అవుతుందని అనుకోలేదు.

” నేను పుట్టగానే పెళ్ళి అయిపోయింది మా బావతో, పెరిగేకొద్దీ నాకూ, మా బావకి చనువు పెరగసాగింది, ఆ చనువు కాస్త ప్రేమగా మారి పెళ్ళి వరకు తీసుకొచ్చింది.”

నా పెళ్ళి ముహూర్తం పొద్దున 9.47 ని.లకి

సమయం 8.55  అవుతుంది.

పంతులు మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు.

” ఓం గణాదిపతయే నమ:”

” అయ్యా.. పెళ్ళి కొడుకుని తీసుకురండి.”

”పంతులు గారు పెళ్ళికొడుకు ఇంకా రాలేదు, వస్తున్నాడు, దారిలో ఉన్నాడు” అని పంతులితో అన్నాడు మా మామయ్య( పెళ్ళి కొడుకు తండ్రి).

సమయం ని.లు అవుతుంది, బావ ఇంకా రాలేదు.

” అమ్మా.. ఆ అక్షింతలు చేతిలో తీసుకో ”

” బావ ఇంకా రాలేదు ”

పీటల మీద కూర్చున్న నేను

” నా కల నిజమయ్యింది ”

” నా బావ నా భర్త కాబోతున్నాడు ”

” బావ ఎప్పుడొచ్చి నా మెడలో తాళి కడితే ఎప్పుడెప్పుడు కొత్త జీవితాన్ని మొదలుపెడుదామా అని ఆలోచిస్తుండగా..”

మా ఇంటి పాలేరు బయటి నుండి ఆయాసంతో పరుగెడుతూ వస్తున్నాడు, చాలా ఆయాస పడుతున్నాడు.

” అయ్యా..అయ్యా..అయ్యా..”

ఏంటి రామయ్య ? ఏమైందో చెప్పు ? ఎందుకంత ఆయాస పడుతున్నావు ? అని మా మామయ్య రామయ్యని అడిగాడు.

” ఆహ్‌..ఆహ్‌..ఆహ్‌..ఆహ్‌..” చాలా ఆయాస పడుతున్నాడు.

అలా ఆయాస పడుతూనే ” బాబు గారికి ”

” హా…బాబుకి??”

” యాక్సిడెంట్‌ అయ్యిందయ్యా..ఆసుపత్రిలో ఉన్నాడు ” అని రామయ్య చెప్పగానే అందరూ కంగారుగా ఆసుపత్రికి బయలుదేరారు.

అందరూ వెళ్ళిపోయారు.

నేను ఒక్కదాన్ని మాత్రం పీటల మీద అలాగే కూర్చున్నాను. అప్పటి వరకు ఆత్రుతగా ఎదురుచూసిన నా కళ్ళు ఒక్కసారిగా కన్నీటితో నిండిపోయాయి.

రెండు గంటలు గడిచాయి. పీటల మీద అలాగే కూర్చున్నాను.

మా పొరిగింటి సత్యం బాబాయి, తన భార్య మాట్లాడుకుంటూ వస్తున్నారు.

వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు నాకు చిన్నచిన్నగా వినపడుతున్నాయి.

అలా మాట్లాడుకుంటుండగా కొన్ని పదాలు నా చెవిని చేరగానే నా గుండె ఒక్కసారిగా ఆగిపోయింది.

నా కన్నీటి చుక్కలు తిరిగి నా కంటిని చేరాయి.

” పాపం దారుణంగా చనిపోయాడు. పాతికేళ్ళకే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ”

నా బావ చనిపోయాడన్న వార్త తెలియగానే, అప్పటి వరకు లోలోపల ఏడ్చిన నేను భాదని ఆపుకోలేకపోయాను.

” ఆహ్‌హ్‌హ్‌హ్‌హ్‌హ్‌హ్‌….” పెద్దగా ఆరుస్తున్నాను.

” టాష్‌ష్‌ష్‌…” గాజులు పగిలాయి.

” బొట్టు చెరిగింది, నాకింకా పెళ్ళి కాలేదు.

” బావా…” ఆని అరుస్తూ ఏడుస్తున్నాను.

” బావా..బావా..బావా..”

” హు హు హు హు…బావా…” నా ఏడ్పు ఆగట్లేదు.

కళ్ళు తెరిచి చూసే సరికి నేనొక మంచం మీద పడుకుని ఉన్నాను.

ఏడ్చి ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోతే మంచం మీద పడుకోపెట్టినట్టున్నారు.

” బావ గుర్తొస్తున్నాడు ”

” ఇప్పుడు నేనొక విదవరాలిని ”

” నాకు నా బావే ప్రపంచం ”

” నాకు నడక నేర్పించింది మా బావే ”

” నన్ను ఇలా తీర్చిదిద్దింది మా బావే ”

” బావ చనిపోయిన తరువాత రోజు నుండి 7 రోజుల వరకు నా నుదిటి మీద బొట్టు లేదు ”

” చేతులకి గాజులు లేవు, 7 రోజులు తెల్ల చీరే కట్టుకున్నాను ”

బావ పుట్టిన రోజు ఆ రోజు (అక్టోబర్‌ 8) , బావ చనిపోయి 8 రోజులు అవుతుంది, సమయం రాత్రి 8 అవుతుంది.

మా వాళ్ళు అందరూ మా బావ ఫోటో దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు.

నేనూ మా బావ ఎంత బాగా కలిసి ఆడుకునేవాళ్ళం, చిలిపిగా కొట్టుకునేవాళ్ళం.

నాకు ఆకలేస్తే తినిపించేవాడు, నాకు జ్వరం వస్తే ఒక తల్లిలా చూసుకునేవాడు.

” బావా… ఐ లవ్‌యూ బావా ”

” హు హు హు హు..” అని ఏడుస్తూ తలుపుకి ఒరిగాను.

” ఊరుకో ప్రియా ..నీకు నేను ఉన్నాను కదా.” అని నన్నెవరో భుజం తట్టారు.

నాకు నా బావ స్వరంలా అనిపించి వెనక్కి తిరిగి చూస్తే మా బావ.

”బావా…” అని లేచి పరుగెత్తుతూ బావని గట్టిగా హత్తుకున్నాను.

” నా నుదిటిపై బొట్టు పెట్టాడు ”

” చేతికి గాజులు తొడిగాడు ”

” కొత్త పెళ్ళి కూతురిలా తయారయ్యాను , అందరి సమక్షంలో బావ నా మెడలో తాళి కట్టాడు ”

అమెరికా నుండి అప్పుడే వచ్చిన మా చిన్న మామయ్యని పట్టుకుని అందరూ ఏడ్పు మొదలుపెట్టారు.

తన పనిలో తను ఉన్న మా ”పెద్ద మామయ్య”( మా బావ తండ్రి) మా చిన్న మామయ్యని చూడగానే చేతిలో ఉన్న కట్టెలని వదిలేసి

” తమ్ముడూ…” అని ఏడుస్తూ మా చిన్న మామయ్యని వాటేసుకున్నాడు.

”ఊరుకో అన్నయ్యా…ప్రియ ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదు ”

అని ఇంటి లోపలికి కదిలి అక్కడ ” బావ ఫోటో పక్కన ఉన్న నా ఫొటోకి, బావ ఫోటోకి” పూల దండ వేసాడు.

” పెళ్ళి కాని వితంతువు చనిపోయింది ”

తన బావని విడిచి ఉండలేక తను కూడా తన బావ దగ్గరికి వెళ్ళిపోయింది.

” తన ఆశ భూమి మీద కాకపోయినా స్వర్గంలో దేవతలందరి సమక్షంలో తను కోరుకున్న అతనితో పెళ్ళి జరిగింది.”

” చచ్చి సాధించటం అంటే ఇదేనేమో ”

తన బావలని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మరదల్లందరికి నా ఈ కథ అంకితం.

Sujith KK

5 thoughts on “పెళ్లి కాని వితంతువు

  1. స్టొరీ రాస్తే దానిలో అర్ధం బాగుండాలి…మంచి కథే కాని పెళ్ళికి ముహూర్తం 9;47 నిమిషాలుకు అన్నావ్…టైం 8.55 అవుతోంది అన్నావ్…బాగానే ఉంది…అసలు పెళ్ళికొడుకు కేవలం ముహూర్తం టైం కు రావడం ఏమిటి…అదేమైనా రిజిస్టర్ పెళ్ళా…? హిందూ సాంప్రదాయం ప్రకారం…పెళ్ళికి ముందే పెళ్లికొడుక్కి కొన్ని ఆచారాలు ఉంటాయి…పాలేరు వచ్చి పెళ్లికొడుక్కి అపాయం జరిగింది అంటే నమ్మడానికి బాగాలేదు……..చూసి రాయండి…మొత్తానికి కథ ఒకే.
    —————————————————————————–కె.పవన్ కుమార్

  2. Namasthey!
    Sujith Anna!
    Naku oka dought.
    …..”Priya”antey pelli kaani vitantivey kadaa?amey yelaa chanipoyindi?vaalla relatives(maradal tho saha) Bava Photo daggara kurchoni yedustunnappudu, vaalla Bava voice vinipinchindi,choosi,hug chesukundannaaru,(yevarini)?America nundi Chinna maamayya okkarey vachhara?

Leave a Reply to Lokeswara Reddy Cancel reply

Your email address will not be published. Required fields are marked *