ఐ లవ యూ…! నువ్వు కాదంటే చచ్చిపోతాను అంటాడు ఒకడు, నన్ను ప్రేమించక పోతే చంపేస్తాను అంటాడు మరోకడు ఇదేనా ప్రేమంటే?
ఎన్నో ఆశలతో, మరెన్నో కోరికలతో యువతరం ముందుకు వెళ్తున్న తరుణంలో ‘ప్రేమ’ అనేది ఒక అత్యవసర చర్యగా ఈ తరం యువతీ యువకులు భావిస్తున్నారు. యవ్వనంలో పుట్టే ఆకర్షణకు ప్రేమ అని పేరును పెడుతున్నారు.
ఎంత ఎక్కువ మంది గర్ల్‌ఫ్రెండ్స్ లేదా బాయ్ ఫ్రెండ్స్ ఉండడం అనేది నేటి యువతరంకి ఒక స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. మా ఇంట్లో దీవీఔ కారు ఉంది అన్నంత గర్వంగా, నాకు నలుగురు గర్ల్ ఫ్రెండ్స్, బాయేఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పుకుంటున్నారు.
భార్య కోసం తాజ్ మహల్‌ను నిర్మించి, తన ప్రేమ కానుకగా ముంతాజ్‌కు అంకితం చేశాడు షాజహన్ కానీ అంతే ప్రేమకోసం ఇప్పుడు నేటి సమాజంలో యాసిడ్ దాడులు, మహిళలపై అత్యాచారాలూ, లైంగిక వేధింపులూ ఎన్నో జరుగుతున్నాయి.
మారుతున్న కాలంతో పాటు ప్రేమించే విధానాలు కూడా update (అప్‌డేట్) అవుతున్నాయి. ఒకప్పుడు కనులు, కనులు (చూపులు) కలిస్తే ప్రేమ, రెండు మనస్సులు కలిస్తే ప్రేమ. ఇప్పుడు నంబర్లు కలిస్తే ప్రేమ, ఫ్రెండ్ రిక్వెస్ట్ (Friend Request) Accept చేస్తే, Like లూ, కమెంట్లూ పెడితే ప్రేమ మరింత త్వరగా పుట్టుకొచ్చేస్తుంది.
ముఖపుస్తకం… అదేనండోయ్! Facebook లో ఫ్రెండ్స్ అవ్వడం, వాట్సప్ లో ఫోటోలు పంపుకోవడం, 4 బంగారాలు, 3 స్వీట్ హర్ట్స్ తో ప్రేమ మొదలవ్వడం ఒక రోజు కలుద్దాం అనడం మరోక రోజు తిరగడం, ఇంకోక రోజు అంతే సాధారణంగా విడిపోవడం నేటి తరానికి సర్వ సాధారణం అయిపోయింది.
నేటి ప్రేమ ఇట్టేపుడుతుంది, అట్టే ముగిసిపోతుంది! ఇలా మారుతున్న దశలో ఒకరి అభిప్రాయాలు మరోకరు తెలుసుకుని దగ్గరకవ్వడం సులభమే! కానీ, ఒకరి అహం (ego) తో మరోకరు ఇమడలేక ఎంత త్వరగా అయితే ప్రేమలో పడుతున్నారో, అంతే త్వరగా break-up(బ్రేకప్) అవుతున్నారు.
ఒకరి అభిప్రాయాలను ఒకరు ఉంచుకుని, ఒకరికి ఒకరు తోడూ, నీడగా ఉండే ప్రేమకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఆకర్షణే ప్రధానంగా, మనసులకు బదులు శరీరాలను పంచుకోవడమే ప్రేమ అనే భ్రమలో నేటి యువతరం ఉంది.
‘Love is like a flowing water in cascade’ పారే సెలయేటిలోని నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ప్రేమ కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న సమాజంలో స్పచ్ఛమైన ప్రేమ అనేది ఆ సెలయేరులో పడి కొట్టుకుపోతుంది. ‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండినా… ‘ అనేది ఒకప్పటి పాట ‘నీ కళ్ళు పేలిపోనూ చూడవే మేరే హయ్…’ అనేది ఇప్పటి ట్రేండ్ ఒకప్పటి ప్రేమ త్యాగానికి ప్రత్యేకత. మరిప్పుడు ప్రేమ అంటే స్వార్థానికి చిరునామా!
ఇప్పటికైనా యువతరం మేల్కోని ఆకర్షణకీ ప్రేమకీ తేడా తెలుసుకుని, జీవితారంభంలోనే యాసిడ్ దాడులు, అత్యాచారాలు వంటినేరాలు చేసి అంతం చేసుకోకండి.
Just wake up
Open your heart
Know the different between
Love and lust’
- నిరీక్షణ - January 31, 2015
- ‘టూ’డేస్ లవ్ - January 28, 2015
True..it should b acceptable from both sides..
Lol samai
excellent. well defined. infatuation is mistaken as love.
Braga chepparu enti yuvata telusukovalisina truth…..