తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ. కె. తారకరామారావు నుంచి ఉత్తమ స్పోర్ట్స్ రిపోర్ట‌ర్ గా అవార్డును స్వీకరించిన మా విద్యార్థి ఎస్.ఎస్.బి. సంజ‌య్ కి అభినంద‌న‌లు.
ప్ర‌స్తుతం ఆంధ్ర‌జ్యోతి స్పోర్ట్స్ క‌ర‌స్పాండెంట్ గా ప‌ని చేస్తున్న సంజ‌య్ 2015 సంవ‌త్స‌రంలో మన కాలేజీ (ఏపీ కాలేజీ అఫ్ జ‌ర్న‌లిజం)లోజాయిన్ అయ్యారు. కోర్సు పూర్తి చేసిన ఆనంత‌రం సొంతంగా వెబ్ మీడియా ప్రారంభించారు. తర్వాత ఏ.బి.ఎన్ ఆంధ్ర‌జ్యోతిలో స్పోర్ట్ విభాగంలో రిపోర్ట‌ర్‌గా చేరి, అన‌తి కాలంలో స్పోర్ట్స్ క‌ర‌స్పాడెంట్‌గాబాధ్య‌త‌లు స్వీకరించారు. స్పోర్ట్స్ కోఆర్డినేటర్ గా కూడా ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే (2020 వ సంవత్సరానికి) ఉత్త‌మ స్పోర్ట్స్ రిపోర్ట‌ర్ గా నిలిచారు.

ఈ సందర్భంగా, కళాశాల ఛైర్మన్ సతీష్ చందర్, కరస్పాండెంట్ ఎం. గౌరీ చందర్ లు అభినందించారు. ఈ సందర్భంగా కళాశాలతో తనకున్న అనుంబంధాన్ని సంజయ్ ప్రస్తుత విద్యార్థులతో 5 ఫిబ్రవరి 2021 నాడు పంచుకున్నాడు.

2 thoughts on “ఉత్తమ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గా మా పూర్వ విద్యార్థి

  1. సాధన చేసావు, సాధించి చూపావు
    మా అందరికి స్ఫూర్తి సారధి వయ్యావు
    సరి లేరు నీకెవ్వరు సీనియర్ సంజయ్ అన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *