Students Blog.

 • ఉత్తమ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గా మా పూర్వ విద్యార్థి

  తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ. కె. తారకరామారావు నుంచి ఉత్తమ స్పోర్ట్స్ రిపోర్ట‌ర్ గా అవార్డును స్వీకరించిన మా విద్యార్థి ఎస్.ఎస్.బి. సంజ‌య్ కి అభినంద‌న‌లు.ప్ర‌స్తుతం ఆంధ్ర‌జ్యోతి స్పోర్ట్స్ క‌ర‌స్పాండెంట్ గా ప‌ని చేస్తున్న సంజ‌య్ 2015 సంవ‌త్స‌రంలో మన కాలేజీ (ఏపీ కాలేజీ అఫ్ జ‌ర్న‌లిజం)లోజాయిన్ అయ్యారు. కోర్సు పూర్తి చేసిన ఆనంత‌రం సొంతంగా వెబ్ మీడియా ప్రారంభించారు. తర్వాత ఏ.బి.ఎన్ ఆంధ్ర‌జ్యోతిలో స్పోర్ట్ విభాగంలో రిపోర్ట‌ర్‌గా చేరి, అన‌తి కాలంలో స్పోర్ట్స్ ...
 • కటాక్షించేవాడు దేవుడా ? కక్షకట్టేవాడు దేవుడా ?

  “ఇచ్చి-పుచ్చుకోండి!“ ఎంత ఇస్తారో అంతకంటే రెండింతలు ఎక్కువ గెలుచుకుంటారు. ధన, కనక, వస్తు రూపంలో నాకు టైం మీద సమర్పించుకుంటే అంతకి రెండింతలు మీరు గెలుచుకుంటారు. ఏదో T.V లో advertisement లా ఉంది అనుకుంటున్నారా? అయితే మీరు తీర్థం లో కాలేసినట్టే. ఇదేంటే? వేస్తే పప్పు లో వెయ్యాలి కానీ విడ్డూరంగా తీర్థం లో వేయడమేంటి అని ఆలోచిస్తున్నారా? తొందరెందుకు దండగా నేను ఉన్నాగా అండగా. ఆవేశపడకండి. మీకు అర్ధమయ్యేలా నేను చెబుతాను. కధలోకి వెళ్ళే ముందు ఇది ...
 • కథ: నిర్భయ పంజా దెబ్బ

  ఆ రోజు సాయంత్రం 8 అవుతుంది. మా ఆంటీ వాళ్ళింటికి వచ్చాను ఒక్కదాన్నే. మెరుపులకి తన కొడుకు అయినటువంటి ఆకాశం మీద కోపం వచ్చింది. ఆకాశంకి భాద కలిగింది, సమస్త ప్రాణలకి మాత అయినటువంటి భూమాత భాద కలిగింది. అమ్మా, నాన్న నన్ను కొట్టారు అని రుజువుగా కన్నీళ్ళు కారుస్తుంది ఆకాశం. ‘వెళ్ళొస్తాను ఆంటీ, వర్షం తగ్గేలా లేదు, మా ఆయన ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు’. ‘రేపు పొద్దున వెళ్ళొచ్చు కాని ఉండమ్మా’. ‘లేదు ఆంటీ, ఇంటి దగ్గర పిల్లలు నేను లేకుంటే ఏడుస్తారు. ...
 • ‘మై లాస్ట్ నోట్’ చెప్పిన “నిజం’’

  ఎన్నో ఆశలు.. ఆశయాలతో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన “రిషితేశ్వరి” సహ విద్యార్థుల లైంగిక వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. అయితే రిషితేశ్వరి బలవన్మరణానికి కారణాలేంటి..? ర్యాగింగ్ భూతమా…? కులాధిపత్య అరాచకమా..? ఇది కచ్చితంగా కులాధిపత్య అరాచకమే….  ర్యాగింగ్ ముసుగులో జరుగుతున్న కులాధిపత్య అరాచకం.. అసలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థుల సమస్యలపై పోరాడడమే విద్యార్థి సంఘాల ప్రథమ కర్తవ్యం.. కాని ఆ విద్యార్థి సంఘాలు ఆ బాధ్యతను మర్చిపోయాయి. ఇప్పుడు అవి విద్యార్థి కుల సంఘాలుగా మారాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ...
 • పెళ్లి కాని వితంతువు

  ధమాల్..! ఒక్కసారిగా పెద్ద అరుపు.. రక్తం ఏరులై సెలఏరులై పారుతుంది. ఆ ఘటన చేసిన అతను కారు దిగి పారిపోయాడు. ”తన కంటి నిండా నీరు, ఏదో కోల్పోతున్నానన్న భాద, బ్రతకాలన్న పట్టుదల” ”తన చేతి వేళ్ళు చిన్న చిన్నగా కొట్టుకోవటం మొదలయ్యింది” అటుగా వెళుతున్న జనమంతా ఆ ఘటన జరిగిన ప్రదేశం దగ్గర మూగారు. ఏదో ఒక చిత్రం చూస్తున్నట్టుగా చూసున్నారే తప్ప, కాపాడటానికి ఒక్కరు కూడా ముందటికి రావట్లేదు. ” చేతి వేళ్ళు భూమిని తాకాయి, కళ్ళకి రక్షణగా ఉండవలసిన రక్షక భటులు ఒక్కసారిగా ఆగిపోయారు, ...
 • క్షమించండి మీ రిషికేశ్వరి

  ఆప్యాత అనురాగాలకి మా ఇల్లు ఓ పొదరిల్లు. అమ్మనాన్నకి నేను ఒక్కదాన్నే అవ్వడంతో చాలా ప్రేమగా పెంచారు. వారి ప్రేమకి ఏ రూపాన రుణం తీర్చుకోను అనిపించేది. కొన్ని లక్షల సార్లు అనుకున్న- బాగా చదివి ఓ స్ధానాన్నిసంపాదించి మా వాళ్ల ఆనందానికి కారణం అవ్వాలని. నా 21 సంవత్సరాలు మా అమ్మనాన్న ప్రేమతో , స్నేహితుల ప్రోత్సాహంతో చిన్న చిన్న అలకలతో సంతోషంగా సాగింది. అవ్వన్నీ ఎప్పటికీ మరిచిపోని అనుభూతులు. ఈ రోజు నేను సాధించాలనుకున్న నా జీవిత ఆశయానికి ...
 • నా తొలి ప్రేమ లేఖ

  ఇదిగో ఈ క్షణం కేవలం నీకోసం మాత్రమే ఆలోచించాలనిపిస్తుంది. తెలియని ఆనందం. అది ఈ వేళ నా తొలి ప్రేమ లేఖగా మారింది. నా తొలి ప్రేమలేఖే కాదు, నా చివరి ప్రేమ లేఖ కుడా నీకేనేమో ! ఎందుకంటే నవ్వు నన్నూ – నేను నిన్ను ప్రేమించుకునంతగా ఎవరు ఎవరిని ప్రేమించలేరేమో. ప్రేమించినా కూడా అది మన ప్రేమ అంత గొప్పది కాలేదేమో. అది గొప్పది అన్నా కూడా నేను ఊరుకోనుగా ! నీతో గొడవ ...
 • నేనంటే అంత చులకనెందుకు

  లోకంలో అందరితో పాటు నేను ఉన్నాను అనుకున్నాను…  కాని ఒ మనిషిలా కాదు ఎవరికి ఏమి కాని ఒ వింత జీవిలా అని ఈ మధ్యనే తెలిసింది… ఇంతకు నేను ఎవరో చెప్పలేదు కదూ… నేనో కాటికాపరిని… చావులు చేస్తాను. పుట్టుకను దేవుడు ఇస్తాడు … మరణాన్ని దేవుడే ఇస్తాడు. ఓ జీవి ఈ లోకంలోకి అడుగు పెడుతున్నడు అంటే ఎక్కడ లేని సంతోషం మనలో కలుగుతుంది.. అలాగే మనకి ఎంతో ఆప్తులైన వారు దూరం అయిపోతే ...
 • నేను బద్దకించిన ఆ ఉదయం…

  ఎవరూ లేని ఎడారిలో ఒక్కదాన్నే ఉన్నట్టు అనిపించింది. కాని ఉన్నారు! చుట్టూరా అరుపులు. ‘కావు – కావు’ మంటూ ఓ పక్కన నా ఫోన్‌ అరుస్తుంది. అయినా తీయబుద్ధికాలేదు. అసలు ఏం పట్టనట్టే పడుకున్నాను. ప్రపంచం మొత్తం అప్పుడే పుట్టిన పసిపాప పాల బుగ్గలా అనిపించింది. ముట్టుకుంటే కందిపోతుందేమో అనుకుంటాంగా అలా ”నేను” మంచం దిగితే ఎక్కడ ఈ చల్లని వాతావరణం ”మిస్‌” అవుతానేమో అనిపించీ అలానే పడుకున్నాను. నాకు చాలా ఇష్టమైన చల్లటి ఐస్‌ క్రీమ్‌ ...
 • పగవాడికి కూడా ఈ జీవితం వద్దు!

  నా పేరు ఒరేయ్‌, అందరూ నన్ను ఇలాగే పిలుస్తుంటారు. ఒరేయ్‌ ఏంటీ గమ్మత్తుగా వుందే నీ పేరు వినగానే నవ్వువచ్చేటట్లు! ఇంతకూ ఈ పేరు పెట్టింది ఎవరూ అనేగా మీ ప్రశ్న. నిజానికి దీన్ని పేరు అని అంటారో లేదో కూడా నాకు తెలియదు. మీ అందరికీ నవ్వు తెప్పించే నా పేరు, నాకు మాత్రం ఇలా ఎవరైనా పిలిస్తే బాధగా వుంటుంది. ఎందుకంటే నాకు అమ్మ నాన్న, బామ్మ అందరూ ఉన్నారు కాని వీరిలో ఏ ...