కటాక్షించేవాడు దేవుడా ? కక్షకట్టేవాడు దేవుడా ?

“ఇచ్చి-పుచ్చుకోండి!“ ఎంత ఇస్తారో అంతకంటే రెండింతలు ఎక్కువ గెలుచుకుంటారు. ధన, కనక, వస్తు రూపంలో నాకు టైం మీద సమర్పించుకుంటే అంతకి రెండింతలు మీరు గెలుచుకుంటారు. ఏదో T.V లో advertisement లా ఉంది అనుకుంటున్నారా? అయితే మీరు తీర్థం లో కాలేసినట్టే. ఇదేంటే? వేస్తే పప్పు లో వెయ్యాలి కానీ విడ్డూరంగా తీర్థం లో వేయడమేంటి అని ఆలోచిస్తున్నారా? తొందరెందుకు దండగా నేను ఉన్నాగా అండగా. ఆవేశపడకండి. మీకు అర్ధమయ్యేలా నేను చెబుతాను. కధలోకి వెళ్ళే […]

నా తొలి ప్రేమ లేఖ

ఇదిగో ఈ క్షణం కేవలం నీకోసం మాత్రమే ఆలోచించాలనిపిస్తుంది. తెలియని ఆనందం. అది ఈ వేళ నా తొలి ప్రేమ లేఖగా మారింది. నా తొలి ప్రేమలేఖే కాదు, నా చివరి ప్రేమ లేఖ కుడా నీకేనేమో ! ఎందుకంటే నవ్వు నన్నూ – నేను నిన్ను ప్రేమించుకునంతగా ఎవరు ఎవరిని ప్రేమించలేరేమో. ప్రేమించినా కూడా అది మన ప్రేమ అంత గొప్పది కాలేదేమో. అది గొప్పది అన్నా కూడా నేను ఊరుకోనుగా ! నీతో గొడవ […]

నేను బద్దకించిన ఆ ఉదయం…

ఎవరూ లేని ఎడారిలో ఒక్కదాన్నే ఉన్నట్టు అనిపించింది. కాని ఉన్నారు! చుట్టూరా అరుపులు. ‘కావు – కావు’ మంటూ ఓ పక్కన నా ఫోన్‌ అరుస్తుంది. అయినా తీయబుద్ధికాలేదు. అసలు ఏం పట్టనట్టే పడుకున్నాను. ప్రపంచం మొత్తం అప్పుడే పుట్టిన పసిపాప పాల బుగ్గలా అనిపించింది. ముట్టుకుంటే కందిపోతుందేమో అనుకుంటాంగా అలా ”నేను” మంచం దిగితే ఎక్కడ ఈ చల్లని వాతావరణం ”మిస్‌” అవుతానేమో అనిపించీ అలానే పడుకున్నాను. నాకు చాలా ఇష్టమైన చల్లటి ఐస్‌ క్రీమ్‌ […]

ఆమె కడుపు కోతకు ”ఆరేళ్ళు”

అదేంటో, ఆమె జీవితంలో అన్ని అడ్డంలకులే. పుట్టడమే అనుమానంతో పుట్టిందట. అమ్మ బొజ్జలో ఏడు నెలలు చప్పుడు చేయకుండా కనీసం వారికి అనుమానం కలిగించేలా కూడా ఆమె కదలలేదంట! అమ్మ కడుపులో ఉండి డాక్టర్లతో దాగుడుమూతలు ఆడిన ఘనత నా స్నేహితురాలికే దక్కుతుందేమో. మొత్తానికి ఏడో నెలలో డాక్టర్లు దాన్ని పట్టేసుకుని ఆమె తల్లిదండ్రులకు తన గురించి చెప్పారు. ఇక అది ఈ లోకానికి రావాల్సిన సమయం వచ్చేసింది. నేను రావాలా? వద్దా? అని ఒక రాత్రంతా […]

కల (Dream)

మా ఇంట్లో నాలుగు గదులున్నాయి. ఆ రోజు నేను మా అమ్మ వాళ్ళ బెడ్‌రూమ్‌లో పడుకున్నాను. హాల్లో నుంచి ఏవో చప్పుళ్ళు. అవి కాస్తా మెల్లిమెల్లిగా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అది కూడా ఏవో ”గిఫ్ట్‌లు రెడీ కదా!” డెకరేషన్‌ అంతా చేసేసారుగా. కేక్‌ తెచ్చారా? ఇంక తనని లేపుదామా. అని ఏవేవో చిన్న స్వరంలో వినిపించాయి. ఇక నేను మెళ్ళిగా లేచి రూం నుంచి బయటకు వస్తున్నా… అంతే ”హ్యాపీ బర్త్‌డే” అని పెద్దగా అరచేసారు. […]

‘అమ్మాయి ఆదిపరాశక్తి’

నిన్న మార్కెట్‌లో కూరగాయలు కొంటుంటే అలా నా చెవిలో ఓ మాట వచ్చి పడింది – ‘అబ్బా! ఆ అమ్మాయి భలే అందంగా ఉంది కదరా’ అంటూ ఒక అబ్బాయి నన్ను చూస్తూ తన పక్కన వాడితో చెబుతున్నాడు. ఆ మాటలు విన్న ఏ అమ్మాయికైన కాస్త కోపం వచ్చినా మనసులో మాత్రం గాల్లో తెలిపోతూ, ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. కోపం ఎందుకు? ఎవడో తెలియని వాడు తనగురించి మాట్లాడుతున్నందుకు కోపం వచ్చినా మనసులో కాస్త సంతోషంగానే ఉంటుందండోయ్‌! ఎంతైనా […]

సోషల్‌ నెట్‌వర్క్స్‌

ఏవండోయ్‌, ఇక నటించింది చాల్లేండి! లేవండి షాపింగ్‌కి టైమ్‌ అయ్యింది. నేనా? నటిస్తున్నానా? నిజంగా నిద్రపోతుంటే ఏంటే నీ గోడవ! అబ్బో, మీరు అబద్ధం చెబుతారేమో కాని మీ వాట్సాప్‌ (whatsapp) లోని లాస్ట్‌ సీన్‌ మాత్రం అబద్ధం చెప్పదండోయ్‌! అనే స్థాయికి సోష్‌ల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు వచ్చేసాయంటే నమ్ముతారా! ఇక పిల్లల విషయానికొస్తే స్కూలు-కాలేజీల్లో ఇచ్చిన హోం వర్కులు చేస్తున్నారో లేదో తెలియదు కాని అన్ని సోషల్‌ నెట్‌వర్కులలో స్టేటస్‌లు (status), ఫోటోలు అప్‌డేట్‌ చేయడం […]