ఎవరూ లేని ఎడారిలో ఒక్కదాన్నే ఉన్నట్టు అనిపించింది. కాని ఉన్నారు! చుట్టూరా అరుపులు. ‘కావు – కావు’ మంటూ ఓ పక్కన నా ఫోన్ అరుస్తుంది. అయినా తీయబుద్ధికాలేదు. అసలు ఏం పట్టనట్టే పడుకున్నాను. ప్రపంచం మొత్తం అప్పుడే పుట్టిన పసిపాప పాల బుగ్గలా అనిపించింది. ముట్టుకుంటే కందిపోతుందేమో అనుకుంటాంగా అలా ”నేను” మంచం దిగితే ఎక్కడ ఈ చల్లని వాతావరణం ”మిస్” అవుతానేమో అనిపించీ అలానే పడుకున్నాను. నాకు చాలా ఇష్టమైన చల్లటి ఐస్ క్రీమ్ లాంటి గాలి, వేడి-వేడి మిర్చీబజ్టి లాంటి దుప్పటి కప్పుకుని తెలియకుండానే పెదాలపై వచ్చిన చిరునవ్వుతో ఆ వాతావరణాన్నీ ఎంజాయ్ చేసిన ఘనత నాకే దక్కుతుందేమో. పిచ్చుకల అరుపులు నా కోసం పాడుతున్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లా అనిపించింది. తెలియకుండానే నా గుండెలో గజ్జెల చప్పుడు నా కాళ్ళని కదిలించేశాయి. అలా పడుకునే కాళ్ళతో డ్యాన్స్ కూడా చేసేస్తున్నాను.
అదీ నా రాకుమారుడి కోసం ఎదురు చూస్తూ చేసినట్టే అనిపించింది!
Leave a Reply